Stock Markets: నష్టాల్లో Sensex, Nifty.. US ఫెడ్ ఆ ధోరణే కారణమా..?
Stock Markets: నిన్న నష్టాల నుంచి గట్టెక్కి స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ డీలా పడ్డాయి. ప్రధాన సూచీలు ఆరంభం నుంచే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.ఉదయం 9.33 గంటల సమయంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 117 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 21 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ 119 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 53 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.
అమెరికా ఫెడ్ సమావేశం ముగియటంతో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రస్తుత సమావేశంలో ఫెడ్ చైర్మన్ పావెల్ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. యథాతథస్థితిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించినప్పటికీ రానున్న కాలంలో పాలసీ బిగింపు ఉంటుందని వెల్లడించింది. అయితే ఇప్పుడు మార్కెట్లలోని అందరి చూపు చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటంపైనే ఉంది.

ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, నెస్లే, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడవుతున్నాయి.
ఇదే క్రమంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, యూపీఎల్, కోల్ ఇండియా, విప్రో కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications