Stock Market: నష్టాల్లో మెుదలైన దేశీయ మార్కెట్లు.. ఫెడ్ మినిట్స్ బయటకు రావటంతో..
Stock Market: నిన్న మంచి లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగటం దీనికి కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు దేశీయ ఐటీ కంపెనీల ఫలితాలు విడుదల కానున్న తరుణంలో ఆ రంగానికి చెందిన కంపెనీల షేర్లు ఫోకస్‌లో ఉన్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 39 పాయింట్లు, నిఫ్టీ సూచీ 4 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు భారత మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 39 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 95 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా అమెరికా-సౌదీ చమురు ఒప్పందం బ్రేక్ కావటంతో ద్రవ్యోల్బణం మరింతగా పెరగుతుందనే భయాలు మార్కెట్లో పెరుగుతున్నాయి. సౌదీ-రష్యా చమురు కూటమి US ఆర్థిక వ్యవస్థకు, అధ్యక్షుడు జో బిడెన్ తిరిగి ఎన్నికల ప్రచారానికి కూడా అన్ని రకాల ఇబ్బందులను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలుస్తోంది. ఇదే క్రమంలో అమెరికా ఫెడ్ మార్చి నెల ఫెడ్ మినిట్స్ వివరాలు బయటకు రావటంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
NSE సూచీలో అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, యూపీఎల్, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, విప్రో, బీపీసీఎల్, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications