Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఈ క్రమంలో కీలక బెంచ్ మార్క్ సూచీలు కుప్పకూలాయి. ప్రధానంగా బేర్స్ చేతిలో మార్కెట్లు కొనసాగుతున్న వేళ 5వ ట్రేడింగ్ రోజు సైతం మార్కెట్లు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్ల మేర నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 156 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 333 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 591 పాయింట్లను కోల్పోయింది. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోయినప్పటికీ కొంత రికవర్ అయ్యింది. ప్రధానంగా ఇజ్రాయెల్-ఇరాల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణంలో ఇన్వెస్టర్లు బలైపోతున్నారు.

ఎన్ఎస్ఈలో కేవలం ఓఎన్జీసీ, ఐటీసీ, అపోలో హాస్పిటల్స్, టైటాన్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్‌టిఐఎమ్, ఎల్‌టి, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, నెస్లే, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications