Stock Market: హమ్మయ్య గాడినపడ్డ మార్కెట్లు.. లాభాల్లో Sensex, Nifty..
Stock Market: మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారాంతంలో మార్కెట్లు లాభాల్లో ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు లాభాల్లోకి రావటం, యూఎస్ మార్కెట్స్ ఫ్లాట్ ముగింపు సెంటిమెంట్లను మార్చాయి.
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 246 పాయింట్ల మేర లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 79 పాయింట్ల లాభంలో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 170 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 167 పాయింట్ల మేర లాభాలతో ఇంట్రాడే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీంతో వరుసగా మూడు రోజుల నుంచి కొనసాగుతున్న నష్టాల ప్రయాణానికి నేడు బ్రేక్ పడింది.

మార్కెట్ల ప్రారంభ సమయంలో ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, సిప్లా, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టి, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications