Stock Market: నిన్న నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాల ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. మంచి లాభాలతోనే ఆరంభమైన సూచీలు ఆ తర్వాత కొంత ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 124 పాయింట్లు, నిఫ్టీ సూచీ 22 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 171 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా నష్టపోయి 31 పాయింట్లు దిగజారింది.

మార్కెట్లలో ఒడిదొడుకుల కారణంగా ఫ్లాట్ గా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో రియల్టీ, పవర్ రంగాలకు చెందిన షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రధానంగా దేశీయ మార్కెట్లలో నాలుగో త్రైమాసిక ఫలితాలను అనేక కంపెనీలు విడుదల చేస్తున్నందున ఆ ప్రభావం సూచీలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు ఓలటైల్ గా కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు.
NSE సూచీలో ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, నెస్లే, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐటీసీ, యూపీఎల్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, టైటాన్, బ్రిటానియా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టి, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్సుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications