IPO News: సూపర్ ఛాన్స్.. బెట్టింగ్ కి రెడీగా 6 ఐపీవోలు.. ఇన్వెస్టర్స్ గెట్‌రెడీ
IPO Updates: వచ్చేవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ఐపీవోల రాకతో బిజీబిజీగా ఉండనున్నాయి. దీంతో దాదాపు ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు 6 కంపెనీల ఐపీవోలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు మాత్రం మెయిన్ గెటగిరీకి చెందినవి కాగా, మిగిలినవి ఎస్ఎమ్ఈ కేటగిరీకి చెందినవి.
ముందుగా మనం మాట్లాడుకోబోతున్నది పాపులర్ వెహికల్స్ కంపెనీ ఐపీవో గురించే. మార్చి 14న ముగియనున్న ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.280-295గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ ఏకంగా రూ.602 కోట్లను సమీకరిస్తోంది. రూ.2 ముఖ విలువ కలిగిన 11,917,075 షేర్లను జారీ చేయాలని కంపెనీ చూస్తోంది. IPOలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయబడింది.

అలాగే రానున్న వారంలో మార్కెట్లలోకి వస్తున్న మరో ఐపీవో క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీది. ఇది మార్చి 14 నుంచి మార్చి 18 వరకు తెరిచి ఉండనుంది. కంపెనీ ఐపీవోలో రూ.175 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు.. ఆఫర్ ఫల్ సేల్ కింద 17,50,000 షేర్లను విక్రయిస్తోంది. ఇదే విధంగా ఇన్వెస్టర్లు ఎస్ఎమ్ఈ కేటగిరీలో బెట్టింగ్ వేసేందుకు వచ్చే వారం ఇన్వెస్టర్లకు ప్రథమ్ ఈపీసీ, సిగ్నోరియా క్రియేషన్, రాయల్ సెన్స్, ఏవీపీ ఇన్‌ఫ్రాకాన్ కంపెనీ ఐపీవోలు సదవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ నాలుగు కంపెనీలు ఐపీవో ద్వారా రూ.107 కోట్లు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రథమ్ ఈపీసీ ఐపీవో మార్చి 11న సభ్యత్వం కోసం తెరవబడుతుంది. పెట్టుబడిదారులకు మార్చి 13 వరకు పందెం వేసే అవకాశం ఉంటుంది. ఒక్కో షేరు ధరను రూ.71-రూ.75గా కంపెనీ నిర్ణయించింది. రాయల్ సెన్స్, సిగ్నోరియా క్రియేషన్ మార్చి 12 నుంచి మార్చి 14 వరకు తెరిచి ఉంటాయి. సినోరియా క్రియేషన్ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.61-రూ.65గా నిర్ణయించబడింది. రాయల్ సెన్స్ ధర 68 రూపాయలుగా నిర్ణయించబడింది.


Click it and Unblock the Notifications