Stock Market Opening: నిన్న భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఐటీ రంగానికి చెందిన షేర్లు పతనం కావటం మార్కెట్లను నిన్న అతలాకుతలం చేసింది. అయితే అనేక కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయటం మార్కెట్లకు కీలకంగా మారింది.
ఉదయం 9.16 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 125 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 113 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 80 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్లకు బలాన్నిచ్చే అంశాలేమీ లేనందున ఆరంభంలో సూచీలు మెల్లగా కదులుతున్నాయి.

ప్రధానంగా WPI ద్రవ్యోల్బణం కనిష్ఠాలకు చేరుకోవటం మార్కెట్ల ఊతమిచ్చే ఒక అంశంగా చెప్పుకోవచ్చు. దీనికి తోడు చైనా జీడీపీ వృద్ధి అంచనాలను అందుకోవటం.. కరోనా ఆంక్షల సడలింపు తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవటం ఆసియా మార్కెట్లలో నష్టాల కట్టడికి సాయం చేసింది. ఈ క్రమంలో వడ్డీ రేట్లను వరుసగా రిజర్వు బ్యాంక్ పెంచటంతో ఏర్పడిన లిక్విడిటీ క్రంచ్ నుంచి ఉపసమనం పొందేందుకు SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా మూలధన అవసరాల కోసం క్యాపిటల్ రైజ్ చేసే పనిలో ఉన్నాయి.
ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, నెస్లే, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎల్ టి, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, మారుతీ, టాటా కన్జూమర్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో సిప్లా, హీరో మోటార్స్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనిలివర్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications