Stock Market: నిరుత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. మిశ్రమంగా గ్లోబల్ మార్కెట్లు..
Stock Market: నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండగా.. అమెరికా మార్కెట్లు మాత్రం ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి.
ఉదయం మార్కెట్లు ప్రారంభమయ్యాక 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల మేర క్షీణతతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 166 పాయింట్లు నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 60 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

అమెరికాలో జూలై ద్రవ్యోల్బణం గణాంకాలు ఊహించిన దాని కంటే కొంచెం తక్కువగా పెరిగిన తరుణంలో నేడు భారతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభిస్తాయని నిపుణులు అంచనా వేసినప్పటికీ మార్కెట్లో నిన్నటి నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. అలాగే యూఎస్ ద్రవ్యోల్బణం నివేదిక ఫెడ్ రేట్లను పెంచుతుందనే అంచనాలను బలపరుస్తోందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి.
ఎన్ఎస్ఈలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, విప్రో, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇండ్రాటేలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, నెస్లే, సిప్లా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications