Stock Market: ఉదయం గిఫ్డ్ నిఫ్టీ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అవుతాయని సూచించాయి. ఒకపక్క అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. మరో పక్క ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభం అయ్యాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం 16 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 48 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 136 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎఫ్ఐఐలు ఫ్యూచర్స్ ఇండెక్స్ లో కొనుగోలుదారులుగా కొనసాగుతున్నారు.

ఇదే క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రెండు అంశాల విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకటి రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశంలో గురువారం వెలువడనున్న ప్రకటన కాగా మరొకటి అదే రోజు విడుదల కానున్న అమెరికా ద్రవ్యోల్బణం సమావేశం. ఈరోజు దేశీయమార్కెట్లకు ప్రపంచ మార్కెట్ ట్రెండ్ దిక్సూచిగా వ్యవహరిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
NSEలో హీరోమోటొకార్ప్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, ఎల్ టిఐఎమ్, కోల్ ఇండియా, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, ఎల్ టి, టైటాన్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, విప్రో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, దివీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, యూపీఎల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇంట్రాడేలో టాప్ లూజర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications