Stock Market: ఆర్బీఐ ప్రకటన కోసం మార్కెట్ల ఎదురుచూపు.. నష్టాల్లో సూచీల ప్రారంభం..
Stock Market: నేడు భారతీయ రిజర్వు బ్యాంక్ మానిటరీ సమావేశం చివరిరోజు. ఈ క్రమంలో కీలక వడ్డీ రేట్లపై ప్రకటన వెలువడనున్న తరుణంలో ప్రస్తుతం మార్కెట్ లోని ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.
ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నెగటివ్ నోడ్ లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 78 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 63 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం డేటా కోసం ఎదురుచూపులతో అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడింగ్ ముగించటం మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, యూపీఎల్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, ఎల్ టి, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, నెస్లే, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్, ఐటీసీ, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications