Market Closing: ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల బలహీనతలను అద్ధం పట్టాయి. అయితే కొద్ది సేపటికే కీలక సూచీలు తిరిగి లాభాల్లోకి పయనించాయి.
ఆచితూచి ముందుకు సాగుతున్న భారతీయ పెట్టుబడిదారులు ప్రధానంగా రేపటి మధ్యంతర బడ్జెట్ ప్రకటనలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీనికి తోడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ మీటింగ్ గురించి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయంలో సెన్సెక్స్ సూచీ 612 పాయింట్లు, నిఫ్టీ సూచీ 204 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 629 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 777 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేసింది.

ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్, సిప్లా, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, గ్రాసిమ్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రయాణాన్ని ముగించాయి.
అయితే ఈ క్రమంలో ఎల్ టి, టైటాన్, బీపీసీఎల్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications