Market Fall: దేశీయ స్టాక్ మార్కెట్లో మెగా ర్యాలీకి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వారాంతంలో మార్కెట్ల కరెక్షన్ సూచీల్లో కనిపిస్తోంది.
ఉదయం 9.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 220 పాయింట్ల మేర నష్టాల్లో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 83 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 81 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 296 పాయింట్ల నష్టంతో మార్కెట్ కరెక్షన్ కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా దేశీయ సూచీలను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో ఆ సెంటిమెంట్ దేశీయ ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. మరో పక్క యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లలో వెనకడుగు వేసేది లేదని చెప్పటం కొంత ఆందోళనలకు కారణంగా నిలుస్తోంది.
NSEలో ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడవుతున్నాయి.

ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, టాటా కన్జూమర్, పవర్ గ్రిడ్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications