Market Closing: ఆసియా మార్కెట్లలో పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ ట్రేడింగ్ లోనే రోజంతా కొనసాగాయి. మార్కెట్లలో అధిక ఓలటాలిటీ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే రియాల్టీ రంగంలోని షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగాయి.
ఈరోజు మార్కెట్లో టాటా మోటార్స్, టైటాన్ షేర్లు తమ హవాను కొనసాగించాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజి సంస్థలు వీటి టార్గెట్ ధరలను పెంచుతూ కొనుగోలు రేటింగ్ అందించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 25 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 206 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 116 పాయింట్లను గెయిన్ చేసింది.
NSEలో మార్కెట్లు ముగిసే సమయానికి టాటా మోటార్స్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, విప్రో, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఎల్ టి, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, హిందాల్కొ, టీసీఎస్, యూపీఎల్, టైటాన్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, దివీల్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యాయి. IDFC ఫస్ట్ బ్యాంక్ (-1.73 శాతం), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (-1.45 శాతం), ICICI బ్యాంక్ (-0.91 శాతం), PNB (-0.74 శాతం), యాక్సిస్ బ్యాంక్ (-0.73 శాతం), HDFC బ్యాంక్ (-0.56 శాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (-0.51 శాతం), ఎస్‌బీఐ (-0.29 శాతం), కోటక్ మహీంద్రా (-0.04 శాతం) నష్టపోయాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications