Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. నిండా ముంచిన IT స్టాక్స్..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం సూపర్ లాభాల్లో ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ.. సాయంత్రానికి ఫ్లాట్ ట్రేడింగ్‌తో ముగిశాయి. ప్రధానంగా ఓలటాలిటీ ఇందుకు కారణంగా నిలిచింది.
సాయంత్రం దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 34 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 1 పాయింట్ లాభపడగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 128 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 367 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి. ఎక్కువ మంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తాయోననే ఆందోళలో ముందస్తు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపారు.

మార్కెట్లు ముగిసే ఎస్బీఐ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే, బ్రిటానియా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, రిలయన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, ఎస్బీఐ లైఫ్, టైటాన్, కోటక్ బ్యాంక్, మారుతీ, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, యూపీఎల్, ఎల్ టి, ఎన్టీపీసీ, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఎల్ టిఐఎమ్, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫివ్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications