Stock Market: నష్టాల్లో ప్రారంభమైన Sensex, Nifty.. ఒత్తిళ్లలో గ్లోబల్ మార్కెట్లు..
Stock Market: నిన్న భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అదే ధోరణిని ప్రారంభించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనప్పటికీ అమెరికా, ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 281 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 75 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 238 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 98 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తులో మరికొంత కాలం పాటు వడ్డీ రేట్లను అధికంగానే కొనసాగించొచ్చని అమెరికా ఫెడ్ పంపిన సంకేతాలతో మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, టాటా మోటార్స్, హిందాల్కొ, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ టిఐఎమ్, నెస్లే, రిలయన్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, టాటా కన్జూమర్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, మారుతీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications