Stock Market: గరిష్ఠాలను చేరుకోవటంలో సూచీల అష్టకష్టాలు.. ఇన్వెస్టర్స్ రియాక్షన్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం కొత్త గరిష్ఠాలకు చేరుకోవటంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్కింగ్ పై ఆసక్తి చూపటంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్క్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 410 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 55 పాయింట్ల క్షీణతతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 123 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 16 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఇదే సమయంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు సైతం లాభాల స్వీకరణకు మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొంత మంది ఎస్ఐపీ చెల్లింపులను నిలిపివేస్తుండగా.. మరికొందరు మాత్రం తమ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అయితే ఇలా చేసేందుకు ఇది సరైన సమయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
NSEలో ఎస్బీఐ లైఫ్, నెస్లే, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, విప్రో, ఇన్ఫోసిస్, సిప్లా, టాటా కన్జూమర్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, మారుతీ, ఎన్టీపీసీ, యూపీఎల్, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications