Stock Market: బెదరకు ముందుకు భారత మార్కెట్లు.. యూఎస్ మార్కెట్లలో అలా జరిగినా..
Stock Market: నిన్న ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు దూకుడు ప్రారంభాన్ని నమోదు చేశాయి. అమెరికా మార్కెట్ పరిణామాలకు బెదరకుండా పాజిటివ్ నోట్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 197 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 66 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 142 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 185 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

ప్రధానంగా అమెరికా మార్కెట్లలో ఐటీ కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేసినప్పటికీ దేశీయంగా ఆ ప్రభావం కనిపించలేదు. నాస్డాక్ సూచీలో 1 శాతం మేర క్షీణత నమోదైంది. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవటం ఒక్కసారిగా ప్రారంభమైంది. రేట్ల పెంపు సూచనలు, రష్యాలో మెుదలైన అంతర్యుద్ధం దీనికి కారణంగా ఉన్నాయి. అయితే గతవారం చిన్న విరామం తర్వాత.. భారత మార్కెట్లు మాత్రం బుల్ జోరును కొనసాగిస్తూనే ఉన్నాయి.
NSEలో హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, నెస్లే, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో సిప్లా, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications