Markets Fall: దేశీయ స్టాక్ మార్కెట్లు యూనియన్ బడ్జెట్ తర్వాత సోమవారం తెరచుకున్నాయి. వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున శనివారం కావటంతో మార్కెట్లను ప్రత్యేకంగా ట్రేడింగ్ కోసం తెరచి ఉంటారు. అయితే ఈ రోజు ఫ్లాట్ ముగింపును చూసిన తర్వాత నేడు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల మధ్య తమ ప్రయాణాన్ని కొత్త వారంలో ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 704 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 205 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 378 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 332 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి. వాస్తవానికి గ్లోబల్ మార్కెట్లు కూడా కొంత మేర నెగటివ్ గా ట్రేడింగ్ కొనసాగించటం కూడా ఇండియన్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తోంది.

ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ టాప్ లూజర్ల జాబితాలో హిందాల్కో మెుదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ప్రధానంగా అమెరికా ఫెడ్ ఎంపీసీ పాలసీ ప్రకటన తర్వాత వచ్చిన బడ్జెట్ కూడా ముగియటంతో.. ఫిబ్రవరి 7, 2025న నిర్వహించబడనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీపైనే ప్రధానంగా ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. అయితే రిజర్వు బ్యాంక్ కొత్త గవర్నర్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశావాదం పెట్టుబడిదారుల్లో కనిపిస్తోంది.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసిన కీలక అంశాల్లో ముందువరుసలో ఉన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం. వాస్తవానికి ట్రంప్ చైనా, కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించిన తర్వాత గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయితే ట్రంప్ చర్యలతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కెనడా చెబుతోంది. తాము కూడా అదే స్థాయిలో అమెరికా దిగుమతులపై సుంకాన్ని విధించనున్నట్లు వెల్లడించటం వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావటానికి ఆర్జ్యం పోస్తోంది.
గ్లోబల్ మార్కెట్ల పనితీరు..
డొనాల్డ్ ట్రంప్ చర్యల తర్వాత ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం క్షీణతతో ముందుకు సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ సూచీ 1.84% క్షీణించగా, టాపిక్స్ 1.75% నష్టపోయింది. ఇదే క్రమంలో సౌత్ కొరియా మార్కెట్ సూచీలు కోస్పి 2.32%, కోస్‌డాక్ 1.9% నష్టాలను చూశాయి. అయితే చైనా స్టాక్ మార్కెట్లు మాత్రం ప్రస్తుతం సెలవులో ఉన్నాయి. ఇదే క్రమంలో అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు కూడా నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి.
ఇదే క్రమంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు ట్రంప్ పరిపాలన పోకడులు, రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశం, క్యూ3 ఫలితాలు, ఐపీవో మార్కెట్, విదేశీ మదుపరుల తీరుతెన్నులు, ముడి చమురు ధరలపై ప్రధానంగా తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications