Stock Markets: నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన కీలక సూచీలు నేడు ఫ్లాట్ ప్రారంభంతో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలు దేశీయ మార్కెట్ల స్తబ్ధతకు ట్రేడవుతున్నాయి.
ఉదయం 9.32 గంటల సమయంలో మార్కెట్లో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 98 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 176 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. కాగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా 137 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ఆసియా మార్కెట్లలోని జపాన్ లాభాలతో ట్రేడవుతుండగా.. హాంకాంగ్, చైనా మార్కెట్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం యూరప్ మార్కెట్లు నష్టాలతో ముగియగా, అమెరికా మార్కెట్లు మిశ్రమ ధోరణితో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాల ధోరణి కొనసాగింది. దీంతో నిన్న విదేశీ ఇన్వెస్టర్లు రూ.412.27 కోట్లు విలువైన పెట్టుబడులను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారని వెల్లడైంది.
ఎన్ఎస్ఈ సూచీలో ఐషర్ మోటార్స్, టీసీఎస్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ టి, టాటా మోటార్స్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, హెస్సీఎల్ టెక్, మారుతీ, అపోలో హాస్పిటల్స్, విప్రో, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, టైటాన్, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలోని హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, ఎస్బీఐ, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, యూపీఎల్, ఐటీసీ, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications