Twitter: బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ డీల్ పూర్తిచేసి తన సొంతం చేసుకున్నారు. లక్షల కోట్లు వెచ్చించి కొన్న కంపెనీలో భారీ మార్పులు తెస్తున్నారు. రాత్రనక పగలనక ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే దీని వెనుక ఒక భారతీయుడు ఉన్నాడనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది
తమిళతంబీ సాయం..
ఎలాన్ మస్క్ గత వారం మైక్రో-బ్లాగింగ్ సైట్‌కి "చీఫ్ ట్విట్" అయిన తర్వాత ట్విట్టర్‌లో పని చేయడంలో సహాయం చేయడానికి భారతీయ సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌ను సంప్రదించారు. టెక్ బిలియనీర్‌కు ట్విట్టర్‌లో "తాత్కాలికంగా" సహాయం చేస్తున్నట్లు కృష్ణన్ సోమవారం వెల్లడించారు. ఇది చాలా ముఖ్యమైన కంపెనీ అని, ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపగలదని తాను నమ్ముతున్నానంటూ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ మాత్రమే దీనిని సమర్థవంతంగా నిర్వహించగలని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు.

వెంచర్ క్యాపిటల్ కంపెనీ..
శ్రీరామ్ కృష్ణన్ క్రిప్టో, వెబ్3 స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టే వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయిన ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (a16z)లో సాధారణ భాగస్వామిగా ఉన్నారు. ఆయన గతంలో ఫేస్ బుక్, స్నాప్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన మైక్రోసాఫ్ట్‌లో ఉత్పత్తి, ఇంజనీరింగ్ బృందాలకు నాయకత్వం వహించారు.

శ్రీరామ్ కృష్ణన్..?
భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజ్‌లో 2001-2005 వరకు చదువుకున్నారు. అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేశారు. చదువు పూర్తైన తర్వాత మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా తన కెరియర్ స్టార్ట్ చేశారు.

ఎలాన్ మస్క్ తో పరిచయం..
శ్రీరామ్ కృష్ణన్ భార్య ఆర్తి రామమూర్తి స్టార్టప్‌ల నుండి వెంచర్ క్యాపిటల్స్, క్రిప్టోకరెన్సీలు వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు క్లబ్‌హౌస్ పేరుతో 2021లో టాక్ షోను ప్రారంభించారు. ఈ షోకు గతంలో ఎలాన్ మస్క్ గెస్ట్‌గా వచ్చారు. దీనికి తోడు వారికి సోషల్ మీడియా కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో ట్విట్టర్ విషయంలో సలహాలు, సూచనలు అందించేందుకు కృష్ణన్ సహాయాన్ని ఎలాన్ మస్క్ తీసుకుంటున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications