ఒకప్పుడు ఆకాశమంత సంపదతో లగ్జరీ లైఫ్ గడిపిన బిలియనీర్, ఇప్పుడు ఆస్తులన్నీ కోల్పోయి ప్రతి పైసా కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక చిన్న పొరపాటు అతడిని ఉన్నత శిఖరాల నుంచి పాతాళంలోకి తోసింది. సున్నా నుంచి మొదలుపెట్టి వేల కోట్లకు అధిపతి అయి ఒక్క ట్వీట్‌తో సర్వం కోల్పోయిన ఆయన ప్రస్థానం నిజంగా ఒక వింతల అనిపిస్తుంది. అతను ఎవరో కాదు బీఆర్ శెట్టి.

బీఆర్ శెట్టి ఆస్తులు, కంపెనీలు: న్యూ మెడికల్ సెంటర్ (NMC), యూఏఈ ఎక్స్ఛేంజ్, Finablr వంటి సంస్థల స్థాపకుడైన బీఆర్ శెట్టి, తక్కువ కాలంలోనే బిలియన్ల డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. 2019లో ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది సంపన్న భారతీయుల లిస్టులో ఆయన చోటు కూడా సంపాదించుకున్నారు.
సామాన్యుడి నుంచి వ్యాపార దిగ్గజం వరకు: 1942లో కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కాపు నగరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన శెట్టి, మొదట మెడికల్ రిప్రజెంటేటివ్‌గా తన కెరీర్ ప్రారంభించారు. మందులు అమ్ముతూనే ఎదో ఒకరోజు తాను కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించగలనని ఆయన కలలో కూడా ఊహించలేదు.
31 సంవత్సరాల వయసులో మెరుగైన అవకాశాల కోసం కేవలం రూ.665తో దుబాయ్‌కి వలస వెళ్లారు. అక్కడ సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తూ, ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నారు. కొద్ది సంవత్సరాలలోనే తన సొంత ఆసుపత్రిని నిర్మించారు, దీనిని ఆయన డాక్టర్ భార్య పర్యవేక్షించేవారు. 1975లో, దుబాయ్‌లో న్యూ మెడికల్ సెంటర్ (NMC) హెల్త్‌కేర్‌కు పునాది వేశారు. ఇది యూఏఈలో మొట్టమొదటి ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ కంపెనీగా అవతరించింది. కొద్ది సంవత్సరాలలోనే ఈ కంపెనీ దుబాయ్‌లోని అతిపెద్ద సంస్థలలో ఒకటిగా మారింది.
యూఏఈ ఎక్స్ఛేంజ్ ఆవిర్భావం: యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు వాళ్ళ కుటుంబాలకు డబ్బు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శెట్టి గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఆయన ఆర్థిక సేవలను అందించే యూఏఈ ఎక్స్ఛేంజ్ అనే కంపెనీని ప్రారంభించారు. కొద్ది సంవత్సరాలలోనే, ఈ కంపెనీ కరెన్సీ ఎక్స్ఛేంజ్ అండ్ ఆర్థిక సేవల రంగంలో అగ్రగామిగా నిలిచింది. 2016 నాటికి యూఏఈ ఎక్స్ఛేంజ్ 31 దేశాలలో 800 బ్రాంచులు ప్రారంభించింది.
శెట్టి స్థాపించిన కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందాయి, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా భారీగా పెరిగింది. ఆయన మొత్తం సంపద సుమారు రూ.20,000 కోట్లకు చేరింది. ఆరోగ్యం, ఆర్థికం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఆయన వ్యాపారాలు విస్తరించాయి. ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన కన్నడిగులలో ఒకరిగా గుర్తింపు పొందారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపిన శెట్టికి రోల్స్ రాయిస్ కార్లు, ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. అంతేకాదు, బుర్జ్ ఖలీఫాలో $25 మిలియన్లకు రెండు అంతస్తులు, దుబాయ్‌లో చాల విల్లాలను కొనుగోలు చేశారు.
ఒక్క ట్వీట్‌తో కుప్పకూలిన సంపద: అంతా అనుకున్నట్లు సాగుతున్న సమయంలో 2019 సంవత్సరం తర్వాత పరిస్థితి తలకిందులైంది. దాదాపు రూ.18,000 కోట్ల విలువైన తన కంపెనీని కేవలం రూ.74కు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగిందంటే 2019లో యూకే ఆధారిత సంస్థ మడ్డీ వాటర్స్ ఒక ట్వీట్‌లో బీఆర్ శెట్టి కంపెనీలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కార్సన్ బ్లాక్ అనే షార్ట్ సెల్లర్ నడుపుతున్న ఈ మడ్డీ వాటర్స్ కంపెనీ బీఆర్ శెట్టి కంపెనీకి $1 బిలియన్ అప్పు ఉందని, ఈ విషయాన్నీ ప్రజలకు ఇంకా పెట్టుబడిదారులకి తెలియకుండా దాచిపెట్టిందని ఆరోపిస్తూ ఒక వార్త వచ్చింది. శెట్టి అప్పులను దాచిపెట్టారని, నగదు ప్రవాహ గణాంకాలను అతిశయోక్తి చేశారని మడ్డీ వాటర్స్ ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత శెట్టి కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
దీంతో బీఆర్ శెట్టి దివాళా తీయాల్సి వచ్చింది. ఆయన తన రూ. 18,000 కోట్ల కంపెనీని కేవలం రూ.74కు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ కంపెనీని ఇజ్రాయెల్-యూఏఈ కన్సార్టియం కొనుగోలు చేసింది. ఒకప్పుడు సంపదతో మునిగిన బీఆర్ శెట్టి ఒక్క ట్వీట్ కారణంగా మొత్తం ఆస్తులు కోల్పోయి పేదరికం అంచులకు చేరుకున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications