భారతీయులకు ఆభరణాలు అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు. అదొక సెంటిమెంట్. సురక్షితమైన పెట్టుబడి కూడా. అయితే మారుతున్న కాలంతో పాటు భారతీయుల అభిరుచులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఆభరణాలు అంటే కేవలం బంగారం మాత్రమే గుర్తొచ్చేది. కానీ, ఇప్పుడు బంగారం, వెండి (Gold Silver) మధ్య పోటీ పెరుగుతోంది. ధరల పెరుగుదల, మారుతున్న జీవనశైలి , డిజిటల్ ప్రభావం వల్ల వినియోగదారులు ఇప్పుడు సరికొత్తగా ఆలోచిస్తున్నారు.

ధరల సెగ.. వెండి వైపు అడుగులు
ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, బడ్జెట్ పరిమితుల వల్ల చాలామంది వెండి నగలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఇప్పుడు వెండి నగలలో అద్భుతమైన డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. క్యారెట్‌లేన్ , పీఎన్‌జీ జ్యువెలర్స్ వంటి ప్రముఖ సంస్థల రిటైలర్లు చెబుతున్న ప్రకారం.. వెండి ఇప్పుడు కేవలం తక్కువ ధర కోసమే కాదు, ఆధునిక స్టైలింగ్ కోసం కూడా వాడుతున్నారు.
ఆన్‌లైన్ బ్రౌజింగ్.. ఆఫ్‌లైన్ కొనుగోలు
మునుపటిలా షాపులకు వెళ్లి గంటల కొద్దీ వెతకడం ఇప్పుడు తగ్గుతోంది. దాదాపు 70 శాతం మంది కస్టమర్లు ముందుగా ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన డిజైన్లను చూసుకుంటున్నారు. సోషల్ మీడియా లేదా వెబ్‌సైట్లలో షార్ట్‌లిస్ట్ చేసుకుని, ఆ తర్వాతే నేరుగా స్టోర్‌కి వెళ్తున్నారు. అక్కడ నగలను స్వయంగా చూసి ఫినిషింగ్ చెక్ చేసుకున్న తర్వాతే ఫైనల్ చేస్తున్నారు. దీనివల్ల ప్రయాస తగ్గడమే కాకుండా బడ్జెట్‌కు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకునే అవకాశం కలుగుతోంది.
స్టైలింగ్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్
ఇప్పుడు నగలు అమ్మడం అంటే కేవలం తూకం వేసి ఇవ్వడం మాత్రమే కాదు. కస్టమర్లకు 'స్టైలింగ్ అడ్వైస్' కూడా అవసరమవుతోంది. ముఖ్యంగా పెళ్లి కూతుళ్లు తమ డ్రెస్సింగ్ కు తగ్గట్టుగా ఎలాంటి నెక్లెస్‌లు లేదా చెవి రింగులు బాగుంటాయో జ్యువెలరీ స్టోర్లలోనే అడిగి తెలుసుకుంటున్నారు. వెస్ట్రన్, ఇండియన్ డ్రెస్సులకు రెండింటికీ నప్పే విధంగా 'వర్సటైల్' నగలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఫంక్షన్లకు హెవీ.. డైలీ వేర్‌కు లైట్!
జీవనశైలి మారడం వల్ల ప్రతిరోజూ ఆఫీసులకు లేదా ట్రావెలింగ్ లో వేసుకోగలిగే 'లైట్ వెయిట్' , 'స్టాకబుల్' (ఒకదానిపై ఒకటి ధరించగలిగే) నగలకి ఆదరణ పెరుగుతోంది. బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ వాడకానికి తక్కువ బరువున్న బంగారు ఆభరణాలను కొంటున్నారు. అదే సమయంలో పెళ్లిళ్ల వంటి పెద్ద ఫంక్షన్ల కోసం వెండిపై గోల్డ్ కోటింగ్ ఉన్న పెద్ద సైజు నగలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో గ్రాండ్ లుక్ పొందవచ్చని కస్టమర్లు భావిస్తున్నారు.
మొత్తానికి ఇండియన్ జ్యువెలరీ మార్కెట్ ఇప్పుడు బంగారం, వెండి (Gold Silver) రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తోంది. పెట్టుబడి కోసం బంగారం వైపు, ఫ్యాషన్, బడ్జెట్ కోసం వెండి వైపు జనం మొగ్గు చూపుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications