IT Sector: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఉత్తమ ఐటీ సేవలకు పెట్టింది పేరు ఇండియా. దీనికి కారణం ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్న ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పక్కన పెట్టి నేరుగా సర్వీస్ రంగంలోకి అడుగుపెట్టడం దీనికి కారణంగా ఉంది. 2025 నాటికి భారతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి పరిశ్రమ 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది.
ఇప్పటి దాకా ఒకలెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా భారతీయ ఐటీ పరిశ్రమ వేగంగా ముందుకు సాగుతోంది. ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీతో సేవలను అందించటానికి ఇప్పటికే భారతదేశంలోని అనేక ఐటీ దిగ్గజాలు ఇప్పటికే తమ ఉద్యోగులను సంసిద్ధంగా మారుస్తున్నాయి. ఈ చర్యల కారణంగా 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జీడీపీలో 10 శాతం వాటాను కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా సమయంలో మంచి బూమ్ చూసిన భారతీయ ఐటీ పరిశ్రమ ఆ తర్వాత వ్యాపార మందగమనంతో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

దశాబ్ధకాలంలో మెుదటిసారిగా భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీలో 10 శాతం ఐటీ పరిశ్రమ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుందని బ్యాక్‌షాట్స్ అంచనా వేసింది. దీనికి ముందు 2014లో ఐటీ పరిశ్రమ మెుత్తం భారతీయ జీడీపీలో 8.1 శాతం వాటాను కలిగి ఉంది. అయితే తర్వాత కరోనా సమయంలో మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా మందగమనాన్ని ఐటీ పరిశ్రమ నమోదు చేసింది. ప్రస్తుతం జీడీపీలో ఐటీ పరిశ్రమ దాదాపు 7 శాతం వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అమెరికా, యూరప్ మార్కెట్లలోని క్లయింట్ల నుంచి స్పెండింగ్ తిరిగుతున్న వేళ భారతీయ ఐటీ పరిశ్రమంలోని అనేక కంపెనీలు మంచి ఆర్డర్లను పొందుతున్నాయి. దీనికి ముందు ఆర్థిక మందగమనం కారణంగా క్లయింట్లు జాగ్రత్తగా స్పెండింగ్ కారణంగా కరోనా తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు భారతీయ ఐటీ కంపెనీలు కష్టకాలాన్ని చూశాయి. ప్రస్తుతం ఏఐ ఆధారిత మోడళ్లను కంపెనీలు తమ పనిలో వినియోగిస్తున్న వేళ దీనికి అనుగుణంగా టాప్ టెక్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి.
ఈ చర్యల కారణంగా ప్రస్తుతం ఐటీ కంపెనీల కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలు దీనికి అనుగుణంగా కొత్త నియామకాల సంఖ్యను కూడా పెంచుతున్నాయి. ఈ రంగం ప్రస్తుతం లక్షల మందికి ప్రధాన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగంగా కొనసాగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే ఇండియా దాదాపు రూ.11.51 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఎగుమతులను చేపట్టిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తాజా పరిణామాలు దేశంలోని టాప్ ఐటీ కంపెనీలతో పాటు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కొత్త విస్తరణ ప్రాజెక్టులు కూడా వాస్తవ వృద్ధిని అందుకునే దిశగా కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications