భారత IT దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు 2025లో చరిత్రలో రెండోసారి భారీగా పడిపోవడం ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు తక్కువ డిమాండ్ అంచనాలు, జనరేటివ్ AI ప్రభావం, మరియు కొన్ని మిక్స్ Q1 ఫలితాలు.

ఈ సంవత్సరం ఇప్పటికే TCS షేర్ విలువ 33% పడిపోయి, షేర్‌హోల్డర్లు రూ. 3.43 లక్షల కోట్ల నష్టాన్ని అనుభవిస్తున్నారు. 2024 డిసెంబరులో 14.82 లక్షల కోట్ల విలువ ఉండగా, ఇప్పుడు 11.38 లక్షల కోట్లకు పడిపోయింది.
2008 లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో IT షేర్లు 56% పడిపోయి రూ. 5.66 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసిన తర్వాత, 2025 ఈ రంగానికి అత్యంత కష్టమైన సంవత్సరం అని చెపోచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు TCSలో వాటాను 12.35% నుండి 11.48%కి తగ్గించగా, మ్యూచువల్ ఫండ్స్ వాటాను మాత్రం 4.25% నుండి 5.13%కి పెంచాయి.
JPMorgan TCS షేర్లను "న్యూట్రల్" నుంచి "ఓవర్‌వెయిట్" గా అప్‌గ్రేడ్ చేసింది. కొత్త టార్గెట్ ప్రైస్ రూ. 3,800 పెట్టింది, అంటే షేర్లలో 24.4% పెరుగుదల అవకాశం ఉంది. CEO K కృతివాసన్ చెప్పినట్టు, బలమైన ఆర్డర్ బుక్ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ఉన్నందున TCSకి మధ్యకాలం-దీర్ఘకాల పెరిగే అవకాశాలు ఉన్నాయి.
BNP Paribas ప్రకారం, "TCS ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి, షేర్ల విలువ ఆకర్షణీయంగా ఉంది, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది టాప్ పిక్." FY26 తర్వాత BSNL డీల్ పరిమాణం తగ్గిన తర్వాత TCS రికవరీ అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు.
రవీ సింగ్ (Religare Broking) ప్రకారం, "TCS షేర్ ప్రస్తుతం 50-డే EMA కింద ట్రేడ్ అవుతోంది. రూ. 3,200 పైకి వెళ్లకపోతే ఎక్కువ లాభం చూడరేము. రూ. 3,000 కింద పడితే షేర్ రూ. 2,850-2,900 వరకు పడవచ్చు. ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్స్ హోల్డ్ చేయాలి, కొత్తగా పెట్టుబడి చేయకూడదు."
మందార్ భోజనే (Choice Broking) ప్రకారం, "షేర్ ఇప్పుడు రూ. 3,144 వద్ద ట్రేడ్ అవుతోంది. ₹3,140 పైగా కొనసాగితే బుల్లిష్ సిగ్నల్. రూ.3,180 కంటే పైకి క్లోజ్ అయితే షేర్ రూ. 3,280-రూ. 3,350 వరకు ప్రయత్నించవచ్చు. సపోర్ట్ లెవల్ ₹3,100-₹3,070 ఇలా ఉంటది.
TCS షేర్లు కష్టాల్లో ఉన్నప్పటికీ, ఇది ఒక్కటే లేదు. 2025లో మొత్తం భారత IT సెక్టార్ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. Infosys, Wipro, HCL Tech వంటి ఇతర ప్రముఖ IT కంపెనీలు కూడా వృద్ధి వేగం తగ్గడం, డిమాండ్ మరియు జెనరేటివ్ AI ప్రభావం వంటి కారణాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలతో TCS యొక్క ప్రస్తుత పనితీరు, మార్కెట్‌లో స్థానం, షేర్ విలువ మార్పులు పోల్చడం ద్వారా భారత IT రంగంలో జరిగే ఓవరాల్ ట్రెండ్, మరియు ఒక్క కంపెనీ మాత్రమే కష్టంలో ఉందా లేక మొత్తం రంగం స్లోడౌన్ లో ఉందా అనే విషయం అర్థమవుతుంది.
TCS ప్రస్తుతం క్రిటికల్ జోన్లో ఉంది. షేర్ రూ. 3,000 స్థాయిని రక్షించుకుంటే రికవరీ అవకాశాలు ఉన్నాయి లేదా, కిందకి వెళ్తే మరింత నష్టం. పెట్టుబడిదారులు జాగ్రత్తగా చూడాల్సిన సమయం ఇది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

TCS ఉద్యోగులకు తీపి కబురు.. ఏప్రిల్ 1 నుంచి జీతాల పెంపు! ఏ గ్రేడ్ వారికి ఎంతంటే?



Click it and Unblock the Notifications