IT News: నియామకాల్లో రూటు మార్చిన టెక్ కంపెనీలు.. వారికే కొత్త ఉద్యోగాలు..
IT News: చాలా కాలంగా దేశంలోని ఐటీ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ రంగంలోని వస్తున్న యువత సంఖ్యకు వాస్తవంగా ఉన్న ఉద్యోగ అవకాశాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోయింది. పైగా కంపెనీలు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసి నెలలు గడుస్తోంది.
దేశంలోని అనేక టెక్ కంపెనీలు ప్రస్తుతం ఆదాయాలు తగ్గటంతో ఖర్చులను తగ్గించటాన్ని టార్గెట్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐటీ రంగం పూర్తి సమయం ఉద్యోగులకు బదులుగా ఎక్కువ మంది అప్రెంటీస్‌లను నియమించుకునే దిశగా కదులుతున్నట్లు అప్రెంటీస్ స్కిల్ ట్రెండ్స్ రిపోర్ట్ సంచలనాన్ని బయటపెట్టింది. IT/ITES స్పేస్‌లో అప్రెంటిస్‌ల సంఖ్య వార్షికంగా 250 శాతానికి పైగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

IT/ITES పరిశ్రమల్లోని దాదాపు 79 శాతం మంది యజమానులు రాబోయే నెలల్లో అప్రెంటిస్‌లను తీసుకోవడంలో పెరుగుదలను అంచనా వేస్తున్నారు. ప్రతిభావంతులైన పూల్‌ను సృష్టించడానికి, సిబ్బంది విధేయతను పెంపొందించడంలో భాగంగా అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్‌మెంట్‌కు టెక్ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. గత సంవత్సర కాలంలో ఈ ట్రెండ్ మెట్రో, టైర్-2 నగరాల్లో ఈ నియామకాలు గణనీయంగా పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీలు అప్రెంటిస్ పూర్తైన వారిలో 75 శాతం మందిని పూర్తి స్థాయి ఉద్యోగులుగా మార్చాయి.
2023లో కోయంబత్తూర్, హైదరాబాద్, పూణే వంటి నగరాలు అప్రెంటిస్ నియామకానికి మార్గం సుగమం చేశాయి. టైర్-2 నగరంగా ఉన్న కోయంబత్తూర్ అంతటా అప్రెంటిస్‌షిప్ అడాప్షన్ పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCR, ముంబై, అహ్మదాబాద్ వంటి ఇతర మెట్రోలు అప్రెంటీస్ నియామకంలో గణనీయమైన పెరుగుదలను చూస్తున్నాయి. రాష్ట్రాల పరంగా, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్‌మెంట్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం అప్రెంటిస్‌లుగా ఉన్న 9 లక్షల మందికి పైగా యువత 23-26 ఏళ్ల మధ్య వయస్కులే. వీరికి కంపెనీలు రూ.11 నుంచి రూ.75 వేల వరకు చెల్లిస్తున్నాయి. విద్యార్హతలను బట్టి ఇతర రంగాలకు స్టైపెండ్ చెల్లింపు భిన్నంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications