Wipro Aquisition: దేశీయ ఐటీ సేవల రంగం ఇటీవలి కాలంలో కొత్త డీల్స్, డీల్స్ రెన్యూవల్ వంటి శుభవార్తలను అందుకుంటున్నాయి. చాలా కాలంగా ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు ఎదుర్కొన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ వల్ల స్తబ్ధతను చూసిన భారతీయ టెక్ కంపెనీలు ప్రస్తుతం దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో అందరి చూపు ప్రస్తుతం విప్రో కంపెనీ షేర్లపై కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళితే భారతీయ టెక్ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన సర్వీస్ కన్సల్టింగ్ సంస్థ అప్లైడ్ వాల్యూ టెక్నాలజీస్ కంపెనీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వ్యూహాత్మకంగా ఈ కొనుగోలు బెంగళూరు కేంద్రంగా వ్యాపారం కొనసాగిస్తున్న భారతీయ టెక్ దిగ్గజం విప్రోకు సానుకూల అంశంగా తెలుస్తోంది. ఈ సంస్థ ఎంటర్‍ప్రైజ్‍లకు కస్టమైజబుల్, డేటా ఆధారితంగా కార్యకలాపాలను ఆధునీకరించుకునేందుకు ఐటీ సేవలను అందిస్తోంది. దీనికి తోడు తాజా కొనుగోలు డీల్ విప్రో ప్రస్తుత అప్లికేషన్ సేవల సామర్థ్యాలను పెంపొందించటంతో పాటు కొత్త వృద్ధి అవకాశాలను అందించడంలో సహాయపడుతుందని విప్రో తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

ఇందులో భాగంగా కంపెనీ అమెరికా సంస్థలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు రూ.339 కోట్లుగా ఉంది. అమెరికా కరెన్సీ ప్రకారం డీల్ విలువ 40 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ కొనుగోలు ఒప్పందం డిసెంబర్ 31, 2024 నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. దీనికి ముందు సైతం ఈ ఏడాదిలో విప్రో మరిన్ని కొత్త వ్యూహాత్మక పెట్టుబడులను చేసింది. విప్రో కొనుగోళ్లను పరిశీలిస్తే.. జనరల్ మోటార్స్, మాగ్నాతో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ SDVerseలో విప్రో 27 శాతం వాటాను 5.85 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీని తర్వాత అమెరికా ఆధారిత ఇన్సర్‌టెక్ కంపెనీ Aggne Globalలో 60 శాతం వాటాను 66 మిలియన్ డాలర్లను కొనుగోలు చేసింది.
బ్రోకరేజీల మాట..
గ్లోబల్ బ్రోకరేజ్ CLSA విప్రోపై బుల్లిష్ వ్యూ కలిగి ఉంది. కంపెనీ షేర్లకు గత టార్గెట్ ధర రూ.303ను ప్రస్తుతం రూ.606కి పెంచింది. అలాగే 'అవుట్‌పెర్‌ఫార్మ్' కాల్‌తో కొనసాగింది. ఇదే క్రమంలో మోర్గాన్ స్టాన్లీ ప్రతి షేరుకు రూ.250 టార్గెట్ ధరను కలిగి ఉంది. ఈ కొనుగోలు బెంగుళూరుకు చెందిన ఐటీ మేజర్‌కు మరింత సామర్ధ్యాన్ని పెంచుతుందని, చిన్న తరహాలో కొంత మంది మార్క్యూ క్లయింట్‌లను దాని పోర్ట్‌ఫోలియోకు చేర్చుతుందని బ్రోకరేజ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications