TCS News: కరోనా తర్వాతి నుంచి దేశయ ఐటీ సేవల రంగంలోని అనేక కంపెనీలు తీవ్ర ఒతిదొడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు, ఎకానమీలు మందగించిన వేళ ఆదాయాలపై టెక్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెల్లగా స్థిమితపడుతున్న వేళ టెక్ కంపెనీలకు మంచి రోజులు తిరిగి వస్తున్నట్లు ఇటీవలి డీల్స్ చూస్తుంటే అర్థమౌతోంది.
ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ తన డెన్మార్క్ క్లయింట్, ప్రముఖ టెలికాం దిగ్గజం టెలినార్ డెన్మార్క్‌తో 5 ఏళ్ల పాటు సేవలను అందించటానికి ఒప్పందం కుదుర్చుకుంటూ డీల్ పై సంతకం చేసుకున్నాయి. ఇది భారతీయ టెక్ కంపెనీకి రానున్న ఐదేళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్ని అందించనుంది. దీన్ని చూస్తుంటే చాలా కాలంగా మందగమనంలో కొనసాగిన టెలికాం రంగం నుంచి డిమాండ్ పుంజుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. గడచిన 6 ఏళ్లుగా టీసీఎస్ టెలినార్ టెలికాం కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణపై పని చేస్తోంది. ప్రస్తుతం టీసీఎస్ దాదాపు 16 లక్షల మంది టెలినార్ కస్టమర్లకు సేవలను అందిస్తోంది.

దాదాపు గడచిన 25 ఏళ్లుగా భారతీయ టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా ప్రముఖ టెలికాం కంపెనీలకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 35,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. TCS టాప్ 10 గ్లోబల్ టెలికాం ఆపరేటర్లలో 5, టాప్-6 యూరోపియన్ ఆపరేటర్లలో నలుగురు, ఉత్తర అమెరికాలోని ఏడుగురు ఆపరేటర్లలో ఆరుగురికి సేవలను అందిస్తోంది.
ఈ డీల్ పై టెలినార్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లూయిస్ హౌరామ్ సానుకూలంగా స్పందించారు. తమ టెలికాం మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి, అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా పరిష్కారాలను అందించడానికి టీసీఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ సదుపాయాలను నిరంతరం అప్‍గ్రేడ్ చేయటంతో వినియోగదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా సేవలను అందించడాన్ని కొనసాగించగలమని పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీలలో డెలినార్ డెన్మార్క్ ఒకటి, ప్రజలు వ్యాపారాలు సులభంగా, సురక్షితంగా కనెక్ట్ కావడానికి టీసీఎస్ కృషిచేస్తోందని డెన్మార్క్‌లోని TCS హెడ్ తాజా డీల్ పై స్పందించారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications