దిగ్గజాల మధ్య యుద్ధం Infosys Vs Cognizant.. అమెరికా కోర్టులో సమరం, పెద్ద ప్లానింగే..
IT News: ప్రస్తుతం భారతదేశంలోని ఐటీ కంపెనీల వ్యాపారం తిరిగి గాడిన పడుతోంది. ఈ క్రమంలో టెక్ దిగ్గజాల మధ్య యుద్ధం కూడా జరుగుతోంది. టాప్ టెక్ కంపెనీలుగా ఉన్న ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మధ్య ప్రస్తుతం మ్యాటర్ సీరియస్ అయ్యింది.
అవును దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పై ఆరోపణలు చేస్తూ కౌంటర్ లా సూట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ తన హెల్త్ కేర్ ఫ్లాట్ ఫారమ్ హెలిక్స్ లాంట్ ఆలస్యం కావటానికి రవికుమార్ కారణంగా పేర్కొంది. టెక్సాల్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టులో ఈమేరకు జనవరి 9న కంపెనీ కేసు ఫైల్ చేసింది. ఇందులో రవి కుమార్ వ్యాపార రహస్యాలను కావాలనే దుర్వినియోగం చేశారని, సీనియర్ ఎగ్జిక్యూటివి స్థాయిలో ఉన్నప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా కీలక ప్రాజెక్టులను వాయిదా వేసినట్లు పేర్కొంది.

ఇన్ఫోసిస్‌లో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవి కుమార్.. ఇన్ఫోసిస్‌లో తన పదవీకాలంలో కాగ్నిజెంట్‌కు మారడానికి చర్చలు జరుపుతున్నప్పుడు హెల్త్ కేర్ ప్రాజెక్టుకు వనరులను నిలిపివేయడం ద్వారా హెలిక్స్ అభివృద్ధిని అడ్డుకున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనివల్ల ప్రాజెక్టు దాదాపు 18 నెలలు ఆలస్యం అయిందని పేర్కొంది. ఇన్ఫోసిస్ హెలిక్స్ ప్రారంభాన్ని ఆపడానికి కాగ్నిజెంట్ పోటీ వ్యతిరేక పథకంలో ఇన్ఫోసిస్ హెలిక్స్‌కు బాధ్యత వహించే కీలక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామించుకున్నట్లు టెక్ దిగ్గజం తన దావాలో పేర్కొంది.
వాస్తవానికి తాజా కౌటర్ ఆగస్టు 2022లో కాగ్నిజెంట్ తన ట్రైజెట్టో హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌తో ముడిపడి ఉన్న వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ ఇన్ఫోసిస్‌పై దావా వేసిన తర్వాత వచ్చింది. అయితే ఈ ఆరోపణలను అప్పట్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఖండించిన సంగతి తెలిసిందే. అలాగే కాగ్నిజెంట్ ప్రవర్తన హెల్త్‌కేర్ ఐటీ సేవల కొనుగోలుదారులకు ఎంపికలను పరిమితం చేయడం ద్వారా పోటీని అణచివేసిందని భారతీయ టెక్ దిగ్గజం వాదిస్తోంది.
వాస్తవానికి కాగ్నిజెంట్ భారతీయ టెక్ కంపెనీల్లోని ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లను నియమించుకోవటం చాలా ఆరోపణలకు దారితీసిన సంగతి తెలిసిందే. విప్రోలో సైతం ఇదే తరహాలో సీనియర్ ఉద్యోగుల ఎగ్జిట్ కంపెనీని దెబ్బతీసింది. కాగ్నిజెంట్ అన్యాయమైన వ్యాపార కార్యక్రమాలను ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించబోమని పేర్కొంది. అయితే ప్రస్తుతం రెండు టెక్ దిగ్గజాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనటంపై ఐటీ పరిశ్రమలో పెద్ద చర్చ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications


