Infosys News: ఉద్యోగులను ఏడిపించిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్.. ఏమైందంటే..??
Infosys News: దేశంలోని అగ్రగామి ఐటీ సేవల కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ దీపావళి తర్వాత ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. దీంతో ఇన్నాళ్లు కష్టపడింది దీనికోసమేనా అంటూ టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ ఇటీవల తన రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తూ నవంబర్ 1, 2023 నుంచి తన ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్ ఉద్యోగులంతా అక్టోబరు నుంచి జీతాల పెంపుకు సంబంధించిన అధికారిక మెయిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికి నిరాశే మిగిలినట్లు తెలుస్తోంది. అయితే వారికి డిసెంబర్‌లో జీతం పెంపు లేఖ, నవంబర్‌లో అడ్వాన్స్ జీతం లభిస్తుందని తెలుస్తోంది. అయితే కంపెనీ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ క్రమంలో ఉద్యోగులను చల్లబరిచేందుకు కంపెనీ జూలై-సెప్టెంబర్ కాలానికి సంబంధించి వేరియబుల్ వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించింది. రెండవ త్రైమాసికానికి కంపెనీ తన ఉద్యోగులకు సరాసరిన 80 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు స్వల్ప ఊరటను పొందుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగం క్షీణిస్తున్న తరుణంలో ఇన్ఫోసిస్ పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని కోల్పోకపోగా.. కొత్త వ్యాపారాన్ని ఆకర్షించడంలో కష్టాలను ఎదుర్కొంటోంది. అలాగే టెక్ దిగ్గజం టీసీఎస్ సైతం ఇదే తరహాలో కీలక ప్రాజెక్టులను కోల్పోయిన సంగతి తెలిసిందే.
లెవల్-6, దీనికంటే కింది స్థాయి ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ త్రైమాసిక పనితీరు బోనస్ చెల్లింపు అర్హత ఉన్న ఉద్యోగులందరికీ నవంబర్ 2023 పేరోల్‌లో జరుగుతుందని కంపెనీ ఉద్యోగులకు వెల్లడించింది. అలాగే యూనిట్ డెలివరీ మేనేజర్లు వారి సంబంధిత యూనిట్లకు చెల్లింపు పంపిణీని ఖరారు చేస్తారని పేర్కొంది. వాస్తవానికి ఇన్ఫోసిస్ నగదును ఆదా చేయడానికి FY23లో జీతాల పెంపును స్తంభింపజేసింది. వ్యాపార సవాళ్ల కారణంగా ఐటి కంపెనీలు మ్యూట్ చేయబడిన ఆదాయ వృద్ధిని నివేదించిన సమయంలో పనితీరు బోనస్ చెల్లింపు వచ్చింది.


Click it and Unblock the Notifications