TCS News: టెక్కీలకు గుడ్‌న్యూస్.. జీతాలు డబుల్ చేయనున్న ఐటీ దిగ్గజం టీసీఎస్..!
Salary Hikes: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తాయోనని ఉద్యోగులు కొంత కాలంగా గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం పెద్ద శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంచటం, వారి వేతనాలను రెట్టింపు చేయాలని చూస్తోందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ జీతాల విషయంలో ఉన్న అసమానతలను తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. కరోనా తర్వాత అట్రిషన్ భారీగా పెరగిన తరుణంలో కొత్త నియామకాలకు ఎక్కువ వేతనాలు ఆఫర్ చేయటం కంటే ఉద్యోగులకు మంచి హైక్స్ ఇవ్వటం ఉత్తమంగా భావిస్తోంది.

కరోనా వల్ల పెరిగిన ఐటీ ఉద్యోగుల డిమాండ్ కారణంగా ఒక కంపెనీలో ఉద్యోగులు మరో కంపెనీలో ఎక్కువ శాతం జీతం ఆఫర్ చేస్తున్నారంటూ కంపెనీలు మారుతూ వచ్చారని TCS ముఖ్య మానవ వనరుల అధికారి(CHRO) మిలింద్ లక్కడ్ అన్నారు. అయితే ప్రస్తుతం కంపెనీ అంతర్గతంగా ఉద్యోగుల్లో ఉన్న జీతాల అసమానతను తగ్గించేందుకు పరిహారాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని పొందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఉద్యోగుల అట్రిషన్ రేటు పెరుగుతున్న సమయంలో వారి జీతం రెండింతలు అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ.. కంపెనీలోని వివిధ ప్రోగ్రాముల్లో ఎక్కువ మందిని ప్రవేశపెడుతోంది. వీటిని క్లియర్ చేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు ఏడాదికి కేవలం 10 శాతంగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 150 దేశాలకు చెందిన ఉద్యోగులు ఉండగా.. వారిలో మహిళల సంఖ్య దాదాపు 35.7 శాతమని కంపెనీ వెల్లడించింది.
మార్తి 31, 2023 చివరి నాటికి కంపెనీ మెుత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,795గా ఉంది. ఇది అంతకు ముందు ఏడాది కంటే కొంత తక్కువ. ప్రస్తుతం ఉద్యోగుల అట్రిషన్ రేటు క్రమంగా తగ్గుతూ 20.1 శాతంగా ఉంది. ఇటీవల విడుదలైన నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకారం కంపెనీ నికర లాభం 14.8 శాతం పెరిగి రూ.11,436 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ నివేధించింది. అయినప్పటికీ ఐటీ దిగ్గజం మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications