IT News: కొత్త నియామకాలను 78 శాతం తగ్గించిన TCS.. మారిపోయిన పరిస్థితులు..

IT News: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అయితే మార్కెట్ అంచనాలను ఐటీ సంస్థ అందుకోలేక పోవటంతో నేడు మార్కెట్లో షేర్లు నష్టాలను చవిచూశాయి.

తాజాగా కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం FY23 చివరి త్రైమాసికంలో 14.7 శాతం పెరిగి రూ.11,392 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నివేదించబడిన రూ.9,926 కోట్లతో పోలిస్తే లాభాలు పెరిగాయి. మూడో త్రైమాసికంలో లాభాలు రూ.10,883 కోట్ల కంటే నాలుగో త్రైమాసికంలో 4.7 శాతం అధికంగా నమోదైంది.

TCS

FY23లో టీసీఎస్ 22,600 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ఇది అంతకు ముందు ఏడాదితో నియామకాల కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. మార్చి 31, 2023 నాటికి కంపెనీ హెడ్‌కౌంట్ 6,14,795గా ఉంది. 2015 ఆర్థిక సంవత్సరం తర్వాత కొత్త నియామకాలు ఇంత భారీ సంఖ్యలో తక్కువగా నమోదు కావటం ఇదే తొలిసారి.

2021లో నికర ప్రాతిపదికన 40,185 మంది ఉద్యోగులను, FY20లో 24,179, FY19లో 29,287 మంది ఉద్యోగులను కంపెనీ నియమించుకుంది. దేశీయ ఐటీ రంగంతో పాటు అంతర్జాతీయంగా కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ 35,209 మంది ఉద్యోగులను చేర్చుకుంది.

TCS

TCS Q1FY23లో 14,136 మంది ఉద్యోగులను, Q2లో 9,840 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. Q3లో 2,197 మంది ఉద్యోగులు తగ్గగా.. Q4లో 821 మంది పెరిగారు. నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ రేటు 20.1 శాతంగా నమోదైంది. దీనికి ముందు క్వార్టర్లో ఉద్యోగుల రాజీనామాల రేటు 21.3 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+