ఈ ఏడాది అమెరికాలో H-1B వీసాలు ఎక్కువగా వచ్చిన కంపెనీల లిస్ట్‌లో అమెజాన్ ముందుండగా 10,044 వీసాలు, TCS 5,505 వీసాలతో రెండో స్థానంలో ఉంది. భారతీయ ఐటీ ఫార్మ్స్ ఇంతకుముందు కూడా ప్రభావం చూపాయి, కానీ ఈసారి బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక టాప్ లిస్టులో మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, గూగుల్ 4,181, డెలాయిట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా అమెరికాస్ 951 వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. అంటే టాప్ టెన్‌లో సగం వరకు భారతీయ ఐటీ కంపెనీలే.

కానీ, ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H-1B వీసా పై సంవత్సరానికి $100,000 ఫీజు అని ప్రకటించడం. "కొంతమంది వలస కార్మికుల ప్రవేశంపై పరిమితి" పేరుతో సంతకం చేసిన ఈ ప్రొక్లమేషన్ "సెప్టెంబర్ 21, 2025" అంటే ఈరోజు నుంచీ అమల్లోకి వస్తుంది. కనీసం ఏడాది పాటు ఇది కొనసాగుతుంది, తర్వాత పొడిగించే అవకాశం కూడా ఉంది.
ఇది వినగానే ఇండియన్ ఐటీ కంపెనీలు టెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. ఎందుకంటే అమెరికాలో స్పెషలైజ్డ్ రోల్స్ కోసం భారతీయ ఇంజినీర్ల పై బాగా ఆధారపడి ఉంటాయి. ఇక కొత్త ఫీజు వల్ల కంపెనీలకు ఖర్చులు పెరగడం ఖాయం.
అమెరికా ప్రభుత్వం మాత్రం తన వైపు నుండి లాజిక్ చెబుతోంది. 2000లో అమెరికాలో ఉన్న విదేశీ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) వర్కర్లు 1.2 మిలియన్లు కాగా, 2019కి అది దాదాపు "2.5 మిలియన్లకు రెట్టింపు" అయిందట. అదే సమయంలో STEM జాబ్స్ 44.5% మాత్రమే పెరిగాయి. కంప్యూటర్, మ్యాథ్స్ జాబ్స్‌లో విదేశీయుల శాతం "17.7% నుంచి 26.1%" కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
అలాగే, H-1B సిస్టమ్‌ని చాలా ఐటీ కంపెనీలు "దుర్వినియోగం" చేశాయని ట్రంప్ ప్రభుత్వం నేరుగా ఆరోపిస్తోంది. అమెరికన్ వర్కర్లను లేఆఫ్ చేసి, మరోవైపు చవకగా H-1B వర్కర్లను తీసుకున్నారని చెబుతున్నారు. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం, "ఎంట్రీ-లెవెల్ H-1B ఉద్యోగులు అమెరికన్ ఫుల్‌టైమ్ వర్కర్ల కంటే 36% తక్కువ వేతనంతో" పనిచేస్తారట.
అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఈ వీసా సిస్టమ్ కంపెనీలకు లాభమే కానీ అమెరికన్ ఉద్యోగులకి నష్టం అవుతోందనే భావనతోనే ట్రంప్ ఈ కొత్త ఫీజు తీసుకొచ్చారు.
ఇక చూడాలి... వచ్చే ఏడాది H-1B ఆధారపడిన భారతీయ కంపెనీలు ఈ అదనపు ఖర్చును ఎలా మేనేజ్ చేస్తాయి? అమెరికాలో అవకాశాలు వేటికవే మారుతాయా. ఇంకోక పక్క $100,000 కొత్త ఫీజు కారణంగా, చిన్న-మధ్యస్థ ఐటీ కంపెనీలు అమెరికాలో H-1B వీసా రోల్స్ తగ్గించవచ్చని అనుకుంటున్నారు. అందువల్ల, కొంతమంది నిపుణులు అమెరికా వెళ్లకుండానే రిమోట్‌గా పని చేయడం ప్రారంభిస్తారు, ఇది "వలస లేకుండా గ్లోబల్ టాలెంట్" అనే కొత్త ట్రెండ్‌ను ఉత్పన్నం చేస్తుంది. ఫలితంగా, భారతీయ కంపెనీలకు ఖర్చులు తగ్గుతాయి, అలాగే భారతదేశంలోనే బిజినెస్ ను విస్తరించడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి.
కొత్త $100,000 ఫీజు వల్ల, అమెరికా కంపెనీలు ఆటోమేషన్, AI సాధనాలు, మరియు అవుట్సోర్సింగ్ పై ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని వల్ల భారతీయ ఐటీ ఫార్మ్స్ కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉండడం తోపాటు, కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి. అంటే, ఇది భారతీయ IT కోసం లాభం-నష్టం రెండూ కలిపిన సిట్యువేషన్ అని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications