Indian IT in US: సాఫ్ట్ వేర్ రంగంలో వరుస లేఆఫ్ ల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులవుతున్నారు. విదేశాల్లో అందులోనూ ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో దాదాపు 2 లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని 'ది వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది.
స్టార్టప్ ల నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ సహా పెద్ద సంస్థల వరకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. మొత్తం తొలగింపుల్లో 30 నుంచి 40 శాతం వరకు భారతీయ ఐటీ నిపుణులు ఉండగా.. వారిలో అధికంగా H1B, L1 వీసాలపై ఉన్నారు.

అరవై రోజులే డెడ్ లైన్
సాధారణంగా అమెరికా వలస వెళ్లిన నిపుణులు H1B, L1 వీసాల ద్వారా పనిచేస్తుంటారు. ఏదైనా కారణాల వల్ల H1B వీసాదారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోపు కొత్తది సాధించాల్సి ఉంటుంది. అప్పుడే అక్కడ ఉండటానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఇండియా తిరిగి రావాల్సిందే. ప్రస్తుతం భారతీయ ఐటీ నిపుణులు ఇక్కడే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగ్గజ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. రెండు నెలల్లో కొత్త కొలువు తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఉదాసీనంగా వ్యవహరించాలి:
అగ్రరాజ్యంలో సాంకేతిక నైపుణ్య లేమిని భర్తీ చేసేందుకుగాను.. ఇండియా, చైనా నుంచి ఏటా పదివేల మందిని అక్కడి టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటుంటాయి. కంపెనీలన్నీ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త కొలువు వెతుక్కోవడం సవాలుగా మారిందని సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్త అజయ్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని.. H1B కార్మికుల పట్ల ఆయా కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. వారి తొలగింపు తేదీని కొంత కాలం పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నిబంధనల పునః పరిశీలన అవసరం:
గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అనే సంస్థలు.. ఉద్యోగం కోల్పోయిన ఐటీ నిపుణులను రిక్రూటర్లతో కనెక్ట్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అర్థం చేసుకుని.. బాధితులను ఆదుకునేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. తద్వారా ప్రతిభ కలిగిన నిపుణులను దేశంలో ఉంచుకోవడమూ లాభదాయకమేనని.. ఆ దిశగా ఆలోచించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పునః పరిశీలించాలని ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నాయి.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications