IT News: టెక్కీలకు షాకింగ్ న్యూస్.. వేరియబుల్ పే కచ్ చేసే అవకాశం.. కొత్త నియామకాలు..
IT News: నాలుగో త్రైమాసికం ముగిసి కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రతికూలతలు మార్జిన్లపై ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇది ఐటీ కంపెనీల్లో వేరియబుల్ పే తగ్గింపులు ఉండవచ్చనే ఆందోళనలను తెరమీదకు తెచ్చింది. దీంతో టెక్ ఉద్యోగులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక మందగమనం మధ్య ఎదురుగాలిని ఎదుర్కొంటున్న దిగ్గజ టెక్ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో , హెచ్‌సీఎల్ లకు రానున్న ఆదాయ సీజన్ పెద్ద అగ్ని పరీక్షగా నిలవనుంది. ఈ ఆర్థిక సంవత్సరం గతంలో పోల్చితే కొత్త నియామకాల విషయంలో మందకొడిగా సాగటం, ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్, వేరియబుల్ చెల్లింపుల్లో కూడా సెక్టార్ పనితీరు ప్రతిబింబిస్తోంది. మరికొంత కాలం ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో నాలుగో త్రైమాసికానికి సంబంధించిన వేరియబుల్ చెల్లింపులు మ్యూట్ చేయబడతాయని HR నిపుణులు చెబుతున్నారు. దిగువ బ్యాండ్ ఉద్యోగులపై తొలగింపుల ప్రభావం తక్కువగానే ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. పైగా వ్యాపార యూనిట్ పనితీరు ఆధారంగా కంపెనీల్లోని ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు చెల్లింపులు ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో పెద్ద ఐటీ కంపెనీల్లో కింది స్థాయి ఉద్యోగులకు 85-100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించేందుకు అంగీకరించవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే అగ్ర ఐటీ సేవల కంపెనీలైన TCS, Infosys, Wipro, HCL క్యాంపస్ రిక్రూట్మెంట్లను తగ్గించాయి. ఎంపికైన విద్యార్థులను ఆన్ బోర్డ్ చేసుకునేందుకు నెలలుగా వేచి ఉంచుతున్నాయని.. ఈ ఒత్తిని తాము చూస్తున్నామంటూ క్వెస్ ఐటి స్టాఫింగ్ CEO విజయ్ శివరామ్ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుత మందగమనం ఖచ్చితంగా నియామకాలు, విస్తరణపై ప్రభావం చూపించనుంది. ఇది కంపెనీల్లో హెడ్ కౌంట్ వృద్ధిని తగ్గించనుంది.

ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా తొలగింపులు, ఉద్యోగ అవకాశాల కొరత అట్రిషన్ రేటు మధ్యస్తంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మిడ్ క్యాప్ ఐటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కూడా లేఆఫ్‌ల ద్వారా తగ్గించవచ్చని తెలుస్తోంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీల్లో ప్లాజెక్టుల కోసం బెంచ్ పై ఎదురుచూస్తున్న టెక్కీల సంఖ్య భారీగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏదైమైనా ప్రస్తుతం టెక్ రంగంలో పరిస్థితులు ఇండియన్ టెక్కీల్లో కొత్త ఆందోళనలను కలిగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications