IT News: ఐటీ కన్నీటి కథలు.. పూర్తిగా చేజారుతున్న కలల ఉద్యోగాలు..!!
IT Jobs: ఉద్యోగం అనేది నేటి సమాజంలో చాలా అవసరమైనది. ఈ క్రమంలో మారుతున్న టెక్నాలజీ అనేక ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెట్టింది. దీంతో యువత ఎక్కువగా ఉన్న భారత్ ఐటీ సేవల రంగంలో భారీగా పురోగతిని సాధించింది. లక్షల మందికి ఉపాధిని అందిస్తోంది.
ప్రస్తుతం పెద్ద ఐటీ సేవల కంపెనీలతో పాటు అనేక చిన్న స్టార్టప్ సంస్థలు ఐటీ సేవల రంగంలోకి ప్రవేశించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే చాలా స్టార్టప్ కంపెనీలు సగానికి పైగా ఉద్యోగులను తొలగించాయి. దీనికి తోడు మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మంది ప్రాజెక్టులు లేక బెంచ్ మీద ఉన్నట్లు చాలా కంపెనీల్లో ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే కొత్త ప్రాజెక్టులు లేకపోవటం, ఉన్న ప్రాజెక్టుల నుంచి పేమెంట్ సకాలంలో రాకపోవటంతో మరిన్ని లేఆఫ్స్ దిశగా కంపెనీలు తమ ఉద్యోగులకు సంకేతాలు ఇస్తున్నాయి.

ఇక పెద్ద కంపెనీల విషయానికి వస్తే అక్కడ సైతం పరిస్థితులు చాలా దారుణంగానే కొనసాగుతున్నట్లు ప్రస్తుత ఉద్యోగులు చెబుతున్నారు. గడచిన కొన్ని నెలలుగా ప్రాజెక్టులు అలాట్ కాకపోవటంతో చాలా మంది టెక్కీలు బెంచ్ పై వేచిచూస్తున్నారని.. బయట సైతం కొత్త ఆఫర్లు లేకపోవటంతో ఉద్యోగం మారేందుకు సైతం తగిన పరిస్థితులు కనిపించటం లేదని ఆందోళన చెందుతున్నారు. చాలా కంపెనీలు కొత్త నియామకాలను సైతం త్రైమాసికంలో నిలిపివేశాయి. కనీసం ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునేందుకు క్యాంపస్ డ్రేవ్స్ సైతం నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాయి.
ఇప్పటికే ఆఫర్ లెటర్లు వచ్చి ఏడాది గడుస్తున్నా కంపెనీలు ఉద్యోగం లోకి పిలవని అభ్యర్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారాయి. గతంలో మాదిరిగా.. ధైర్యం చేసి ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరొకటి కొనుగోలు చేయాలని అస్సలు ప్రయత్నించకూడదని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా మారిన గడ్డు వ్యాపార పరిస్థితుల కారణంగా టెక్ ఉద్యోగులు తాము ప్రస్తుతం ఉన్న జాబ్ పోకుండా ఉంటే చాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications