Tech Mahindra: తలకిందులైన టెక్ మహీంద్రా లాభాలు.. క్యూ-2లో 62 శాతం తగ్గుదల..
Tech Mahindra Q2 Results: దేశీయ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా తన సెప్టెంబర్ ఫలితాలను నేడు విడుదల చేసింది. అయితే కంపెనీ పనితీరు క్యూ2లో పూర్తిగా పెట్టుబడిదారులను నిరాశకు గురిచేసింది.
ఐటీ సేవల రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టెక్ మహీంద్రా ఏడాది ప్రాతిపదికన 61.6 శాతం నికర లాభం తక్కువగా నమోదు చేసింది. దీంతో సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ పన్నుల తర్వాత లాభం రూ.494 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,285.4 కోట్లుగా ఉంది. అయితే కంపెనీ తన ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

ఇదే క్రమంలో డివిడెండ్ కోసం నవంబర్ 2, 2023ను రికార్డు తేదీగా బోర్డు నిర్ణయించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 2 శాతం తగ్గి రూ.12,864 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయాన్ని గమనిస్తే.. రూ.13,129.5 కోట్లుగా ఉంది. ఫలితాలను కంపెనీ మార్కెట్లు ముగిసిన తర్వాత విడుదల చేసింది. టెక్ మహీంద్రా షేర్లు బీఎస్ఈలో నేడు 1.16% తగ్గి రూ.1141.70 వద్ద ట్రేడింగ్ ముగించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.11 లక్షల కోట్లకు పడిపోయింది.
సెప్టెంబర్ త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయంలో 2.8 శాతం, వార్షిక ప్రాతిపదికన 5.1 శాతం క్షీణించి 1,555 మిలియన్ డాలర్లుగా నమోదైంది. EBITDA త్రైమాసిక ప్రాతిపదికన 20.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 47.3 శాతం క్షీణించి 129 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ వద్ద ప్రస్తుతం ఫ్రీక్యాష్ ఫ్లో 213 మిలియన్ డాలర్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications