Dividend Stock: సెప్టెంబర్ త్రైమాసికం ముగియటంతో కార్పొరేట్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో తమ ఈక్విటీ ఇన్వెస్టర్లకు మంచి డివిడెండ్ ప్రకటిస్తున్నాయి.
ఇన్వెస్టర్లు త్రైమాసిక ఫలితాల కాలంలో ఎక్కువగా డివిడెండ్ ఇచ్చే కంపెనీల షేర్లపై బెట్టింగ్ పెడుతుంటారు. అలాంటి ఆలోచన ఉన్న పెట్టుబడిదారులకు ఇదొక శుభవార్తని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐటీ సేవల రంగంలోని కంపెనీ అయిన LTIMindtree Ltd ఈ వారం స్టాక్ మార్కెట్లో ఎక్స్-డివిడెండ్‌గా ట్రేడ్ చేస్తోంది. ఈ క్రమంలో అర్హులైన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.20 చొప్పున డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. దీనికి ముందు ఆగస్టులో కంపెనీ డివిడెండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

డివిడెండ్ చెల్లించటానికి రికార్డు తేదీని అక్టోబర్ 27, 2023గా కంపెనీ నిర్ణయించింది. అంటే ఈ తేదీ నాటికి కంపెనీ పుస్తకాల రికార్డుల్లో షేర్లను కలిగి ఉండే ఇన్వెస్టర్లకు కంపెనీ డివిడెండ్ ఆదాయాన్ని చెల్లిస్తుందని అర్థం. అంటే దీనికి అర్హత పొందాలనుకునే ఇన్వెస్టర్లు గడువు సమయంలో కంపెనీ షేర్లను తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉండాల్సి ఉంటుంది. కావాలంటే రికార్డు తేదీ తర్వాత షేర్లను మార్కెట్లో విక్రయించొచ్చు.
కంపెనీ గతంలో కూడా తన పెట్టుబడిదారులకు మంచి డివిడెండ్ ఆదాయాన్ని అందించిన ట్రాక్ రికార్డును కలిగి ఉంది. ఆగస్టు నెలలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.40 ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. అలాగే జనవరి 2023లో ఒక్కో షేరుపై ఇన్వెస్టర్లకు రూ.20 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. ఇక శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర రూ.5,416.80గా ఉంది. గత ఏడాది కాలంలో కంపెనీ స్టాక్ ధర 9 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అలాగే ఆరు నెలల కిందట కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు 29 శాతానికి పైగా లాభాన్ని పొందారు.


Click it and Unblock the Notifications