ఐటీ కంపెనీల్లో ఇలాంటి పాడు పనులా.. ఛీ..ఛీ.. ఉద్యోగుల భద్రతకు పెను ముప్పు?

భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ బీపీఓ ఆఫీసులో కొందరు పురుష ఉద్యోగులు ఒక సిండికేట్‌గా ఏర్పడి, తోటి హిందూ మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసి లైంగికంగా వేధించడమే కాకుండా, బలవంతంగా మతం మార్చేందుకు ఒత్తిడి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం 2022 నుంచి జరుగుతున్నట్లు విచారణలో తేలింది.

ఈ కంపెనీలో టీమ్ లీడర్లుగా పనిచేస్తున్న కొందరు పురుషులు, హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న ఒక ముస్లిం మహిళతో కలిసి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. దీని ద్వారా హిందూ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా, వారిని ఇస్లాం మతంలోకి మార్చడానికి బలవంతం చేశారు. పోలీసులు మఫ్టీలో 40 రోజుల పాటు ఈ ఆఫీసులో పనిచేసి, సమాచారం సేకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

భారతదేశంలోనే అతిపెద్ద IT కంపెనీలో ఇలాంటి మత మార్పిడి ముఠా పనిచేస్తోందా అని దేశవ్యాప్తంగా ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. ఈ ఘటనపై టీసీఎస్, పోలీసులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఈ మత మార్పిడి ముఠాకు విదేశీ శక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

మరోవైపు, నిందితులైన పురుష ఉద్యోగులు మహిళా ఉద్యోగులను ఎలా టార్గెట్ చేసి టార్చర్ పెట్టారనే వివరాలు రోజూ బయటకు వస్తున్నాయి. దీంతో కార్యాలయాల్లో మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీసీఎస్‌లో పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పుడు ఇన్ఫోసిస్ సంస్థపైనా ఇలాంటి ఆరోపణలే రావడం కలకలం రేపుతోంది.

ఇన్ఫోసిస్ పుణె ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి, కొందరు సహోద్యోగులు తనను లైంగికంగా వేధిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ఇన్ఫోసిస్, ఈ సోషల్ మీడియా పోస్ట్ తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. తమ సంస్థలో ఎలాంటి వేధింపులకు, వివక్షకు తావులేదని, ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది. ఉద్యోగులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను తెలియజేయాలని కూడా సూచించింది.

ఈ నేపథ్యంలో, మరో పెద్ద టెక్ కంపెనీ టెక్ మహీంద్రా 'మినీ పాకిస్థాన్‌'లా పనిచేస్తోందంటూ వచ్చిన ఆరోపణలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. ముంబైలోని గోరేగావ్‌లో ఉన్న టెక్ మహీంద్రా ఆఫీసులో మతపరమైన వివక్ష చూపిస్తున్నారని ఓ ఉద్యోగి తనకు మెసేజ్ పంపినట్లు అడ్వకేట్ దూబే 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

ఈ ఆఫీసులో హెచ్‌ఆర్ ఒక ముస్లిం అని, అందుకే ఇక్కడ 60% మంది పురుష ఉద్యోగులను ముస్లింలనే నియమించుకున్నారని ఆ ఉద్యోగి ఆరోపించారు. ఇక్కడ పనిచేయాలంటేనే భయంగా ఉందని వాపోయారు. ముస్లిం ఉద్యోగులకు ఎలాంటి కార్పొరేట్ నిబంధనలు వర్తించవని, వారు బురఖా, హిజాబ్ ధరించి రావొచ్చని కూడా పేర్కొన్నారు. ఈ ఆఫీస్ ఒక 'మినీ పాకిస్థాన్‌'లా మారిందని ఆ మెసేజ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

మరో వ్యక్తి, టెక్ మహీంద్రా ఆఫీసులో రంజాన్ ముగిసే వరకు ప్యాంట్రీలోకి (ఫుడ్ కోర్ట్) బూట్లు వేసుకుని రాకూడదని నోటీస్ అంటించారని ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను టెక్ మహీంద్రా ఖండించింది. ఆ ఫోటో తమ ఆఫీసులో తీసింది కాదని స్పష్టం చేసింది. అలాగే, తాము ముస్లింలకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామనే ప్రచారంలోనూ నిజం లేదని తెలిపింది. అందరినీ కలుపుకొనిపోయే పని వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నామని, ఉద్యోగులందరినీ ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా చూస్తామని వివరణ ఇచ్చింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+