IT Companies: ఉద్యోగాలు ఫసక్..! మూన్‌లైటింగ్‌పై ఐటీ కంపెనీలు సీరియస్.. తెరమీదకు కొత్త విషయాలు..

IT Companies: గత కొన్ని రోజులుగా ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్‌పై చర్చ నడుస్తోంది. ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్స్ చేయటం నైతికంగా సరైనది కాదని అనేక కంపెనీల ఉన్నత స్థాయి అధికారులు, కంపెనీల అధినేతలు సైతం వ్యతిరేకిస్తున్నారు. అయితే దీని గురించి పలు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో చెప్పిన విషయాన్ని ఎవరైనా గమనించారా..? అసలు ఐటీ కంపెనీలు ఏమంటున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

TCS

TCS

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ మొదలైన కంపెనీల ఒప్పందాలు బిజినెస్ టుడేలో ప్రచురించబడ్డాయి. అసలు అందులో ఉన్నరూల్స్ ఏమి చెబుతుందో చూద్దాం. TCS కాంట్రాక్ట్ ప్రకారం దాని ఉద్యోగులను రెండవ ఉద్యోగంలో చేరడానికి అనుమతించదు. కంపెనీ నుంచి వ్రాతపూర్వక అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఉద్యోగులు మూన్‌లైటింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ షరతును అంగీకరించని పక్షంలో TCS తన ఉద్యోగ ఆఫర్‌ను ఉపసంహరించుకునే హక్కును కలిగి ఉంది.

Infosys

Infosys

సెకండరీ వర్క్‌పై ఇన్ఫోసిస్ కూడా ఆంక్షలను కలిగి ఉంది. జాబ్ ఒప్పందం పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్, డైరెక్టర్ / భాగస్వామి / ఉద్యోగిని ఏ విధంగానూ అంగీకరించదు. అంటే.. కంపెనీ షరతుల ప్రకారం పాటించని ఉద్యోగికి జాబ్ ఆఫర్‌ను ఉపసంహరించుకునే హక్కును కలిగి ఉంది.

అయితే, కొన్ని రోజుల క్రితం అదే ఇన్ఫోసిస్ కంపెనీ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ భాయ్ స్పందిస్తూ.. తాను మూన్‌లైట్‌ను మోసం చేసినట్లు భావించడం లేదని ప్రకటించారు. ఇన్ఫోసిస్ తమ కంపెనీకి రాజీనామా చేసిన ఉద్యోగులందరూ రాబోయే 6 నెలల్లో TCS, Wipro, Cognizant, IBM, Accenture వంటి IT కంపెనీల్లో చేరకూడదని కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.

Wipro

Wipro

విప్రో అపాయింట్‌మెంట్ లెటర్‌లో ఉద్యోగులు కంపెనీ కోసం మాత్రమే పనిచేయాలని స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులు సెకండరీ ఎంప్లాయ్‌మెంట్‌లో నిమగ్నమవ్వాలనుకుంటే తప్పనిసరిగా వారి వ్యాపార విభాగం అధిపతి ఆమోదం పొందాలని ముందుగానే పేర్కొంది.

Tech Mahindra

Tech Mahindra

టెక్ మహీంద్రా కూడా అనుమతి లేకుండా సెకండరీ వర్క్ చేయకూడదని నియామక సమయంలో అందించే షరతుల్లో ఉద్యోగులకు తెలిపింది. కంపెనీ పెట్టిన నిబంధనలను ఉల్లంఘిస్తే ఉద్యోగాన్ని తొలగించవచ్చని కూడా అందులో చెప్పబడింది. ఉద్యోగులు పూర్తిగా కంపెనీ వ్యాపారంపై దృష్టి పెట్టాలి. ఒకవేళ రెండో ఉద్యోగం చేయాలని అనుకుంటే అదుకోసం కంపెనీ నుంచి ముందుగానే వ్రాతపూర్వక అనుమతి పొందాలని షరతులు చెబుతున్నాయి.

HCL Tech

HCL Tech

HCL టెక్ తన ఒప్పందంలో ఇతర వ్యాపార కార్యకలాపాలు లేదా ఉద్యోగాలను ఏకకాలంలో నిర్వహించటం లేదని ఉద్యోగులు అంగీకరిస్తూ సంతకం చేయాలి. చాలా ఐటి కంపెనీలు తమ మునుపటి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ల్లో మూన్ లైటింగ్ గురించి స్పష్టంగా హెచ్చరించాయి. ఉద్యోగాల్లో చేరిన సమయంలో ఈ షరతులకు అంగీకారం తెలిపిన ఉద్యోగాలు ఇప్పుడు ఒకవేళ రెండు ఉద్యోగాలను ఏకకాలంలో నిర్వహిస్తున్నట్లయితే తప్పక జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఉద్యోగులపై కంపెనీలు త్వరలో ఒక నిర్ణయం లేదా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఐటీ రంగంలోని నిపుణులు అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+