IT News: గడచిన కొన్ని సంవత్సరాలుగా ఐటీ బూమ్ పీక్స్ కు చేరుకుంది. ఎవరిని ముట్టుకున్నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటూ నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కారం చెల్లిపోయింది.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీయ టెక్ కంపెనీలు అత్యంత గడ్డు కాలాన్ని చూస్తున్నాయి. వస్తున్న ఆదాయాలకు తగ్గుతున్న మార్జిన్లు తోడుకావటంతో పాటు పెరిగిన ఉద్యోగుల ఖర్చులతో కంపెనీలు రూటు మార్చేశాయి. ఈ క్రమంలో జీతాల పెంపుల కోసం కంపెనీలు మారే టెక్కీలకు కళ్లెం వేస్తున్నాయి.

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ వంటి టాప్ టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ.. కొత్త నియామకాలను దాదాపుగా తగ్గించేశాయి. దీంతో అట్రిషన్ రేటు తగ్గింది. చాలా మంది ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కంపెనీల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఐటీ రంగంలో వేతన పెంపులు 7-12 శాతం మధ్య ఉంటాయి. అయితే కరోనా కాలంలో టెక్కీలకు డిమాండ్ పెరగటం వల్ల కంపెనీలు ఉద్యోగులను ఆకర్షించేందుకు వారి పాత జీతంపై 30-40 శాతం పెంపును ఆఫర్ చేశాయి. అయితే ఇప్పుడు మాత్రం జీతాల పెంపు కోసం కంపెనీలు మారే ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.
కంపెనీలు సైతం ఖర్చుల మదింపులో భాగంగా ఎక్కువ వేతనాలను ఆఫర్ చేసేందుకు సుముఖంగా లేవని పలు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి తక్కువ జీతానికైనా ఉద్యోగం దొరికితే చాలని ఫ్రెషర్లు, రెసిషన్ లో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు అనుకుంటున్నారు. టీసీఎస్ వంటి కంపెనీలు వార్షిక వ్యాపారంలో 440 మిలియన్ డాలర్లు నష్టపోతున్నందున కొత్త ఉద్యోగులను భారీగా తగ్గించాయి. ఫలితంగా ఐటీ రంగంలో మొత్తం ఉపాధి తగ్గింది. గత కొన్ని నెలలుగా GCC కంపెనీలు మాత్రమే టెక్ ఉద్యోగులను నియమించుకున్నాయి.

ప్రస్తుతం లేబర్ మార్కెట్‌లో టెక్ వర్కర్ల సప్లై పెరిగినప్పటికీ.. ఖాళీల సంఖ్య తక్కువగానే ఉన్నాయి. దీంతో కొత్త కంపెనీలోకి మారే ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న హైక్స్ సగానికి పైగా పడిపోయాయి. ప్రస్తుతం కంపెనీలు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డైటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు, క్లౌడ్ ఇంజనీరింగ్ వంటి నిపుణులకు మాత్రమే మెరుగైన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. చాలా కంపెనీలు కొత్త ప్రాజెక్టులు తగ్గటంతో అనేక మంది ఉద్యోగులను బెంచ్ పై కొనసాగిస్తున్నాయి. పరిస్థితులు రానున్న త్రైమాసికాల్లో వేగంగా మారకపోతే కంపెనీల్లో ఉద్యోగుల ఊచకోత తప్పదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications