IT News: తొలగుతున్న ఐటీ ఉద్యోగాల బ్రాంతి.. అసలు వాస్తవాలు ఇవే.. షాకింగ్ నిజాలు
IT News: ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ కంపెనీలు తమ రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరి చూపు ఐటీ సేవల రంగంలోని ప్రధాన దిగ్గజాలపైనే ఉంది.
అయితే ఇటీవల టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ తర్వాత తాజాగా విప్రో తన సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ అన్ని కంపెనీల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ముందుగా ఇవన్నీ మార్కెట్ అంచనాలను అందుకోవటంలో దాదాపుగా విఫలమయ్యాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా ఏర్పడిన వ్యాపార అస్థిరతలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవటంతో డీల్స్ సన్నగిల్లాయిత.

ఇప్పుడు అన్నింటి కంటే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నాలుగు టెక్ కంపెనీల్లో క్యూ2 హెడ్ కౌంట్ 21,000 మేర తగ్గింది. FY24 మొదటి అర్థభాగంలో నాలుగు కంపెనీలు దాదాపు 39,000 మంది ఉద్యోగులను కోల్పోయాయి. ఇది ఉద్యోగుల సంఖ్యలో భారీ తగ్గింపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది మెుదటి ఆరు నెలల కాలంలో కంపెనీలు దాదాపు 81,650 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. ఈసారి దీనికి పూర్తి విరుద్ధంగా కొత్త ఉద్యోగులకు బదులు ఉన్న ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. పైగా కంపెనీలు భారీగా రిక్రూట్మెంట్స్ చేసుకునే యోచనలో లేవు.
కొన్ని కంపెనీలు ఫ్రెషర్లను తీసుకుంటామని చెబుతున్నప్పటికీ వారి ఆన్ బోర్డింగ్ ఎప్పటికి జరుగుతుందో తెలియని పరిస్థితి. విద్యార్థుల గత అనుభవాలను పరిశీలిస్తే.. ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాత దాదాపు ఏడాదికి పైగా కంపెనీ నుంచి పిలుపు కోసం ఎదురుచూసి చివరికి నిరాశకు గురైన వారి సంఖ్య గురించి చెప్పుకోనక్కర్లేదు. ఇక మధ్యస్థ టెక్ కంపెనీల్లోనూ ఇదే పరిస్థితి. కొత్త నియామకాల సంఖ్య వందలకే పరిమితమౌతోంది. ఇదే సమయంలో అట్రిషన్ రేటు సైతం తక్కువగానే ఉంటోంది. కంపెనీలు ఉన్న ఉద్యోగులను అప్ స్కిల్లింగ్ చేసి తమ వ్యాపారాల్లో ఆపరేటింగ్ ఎఫీషియన్సీని పెంచుకోవాలని చూస్తున్నాయని వెల్లడైంది. దీని ప్రకారం భారీగా ఐటీ ఉద్యోగాలు అనేది రానున్న కొన్ని త్రైమాసికాల వరకు కలగానేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications