Stock Market: వచ్చే వారం మార్కెట్లను శాశించే కీలక అంశాలివే.. ఇన్వెస్టర్స్ ఓ లుక్కేయండి..
Market Next Week: దేశీయ స్టాక్ మార్కెట్లలో క్యూ-4 ఆర్థిక ఫలితాల విడుదల చివరి దశకు వచ్చేవారం చేరుకుంటోంది. ఈ క్రమంలో భారతీయ ఈక్విటీలు ప్రధానంగా ఆటో అమ్మకాలు, గ్లోబల్ పరిస్థితులు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వంటి కీలక అంశాలు ప్రభావితం చేయనున్నాయి.
ఇదే క్రమంలో విదేశీ ఇన్వెస్టర్ల ప్రవాహం, యూఎస్ డాలర్‌తో రూపాయి మారకపు కదలికలు, ముడి చమురు ధోరణి వంటి ఇతర అంశాలు కూడా రాబోయే వారంలో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో కొత్త నెల ప్రారంభం కానున్నందున ఇన్వెస్టర్లు ఆటో అమ్మకాలు, తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ, డీజీపీ వంటి అంశాలను పెట్టుబడిదారులు తప్పక పరిగణలోకి తీసుకుంటారు.

మార్కెట్లు స్థూల డేటా, యూఎస్ రుణ చర్చలు, రాబోయే సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశాలపై దృష్టి సారిస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అలాగే ఆర్థిక ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరుకుందని వారు చెబుతున్నారు. అలాగే రానున్న వారాల్లో నిఫ్టీ సూచీ దాని మునుపటి జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంటుందని అంచనా వేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు 2 వారాల సుదీర్ఘ కన్సాలిడేషన్ దశను ముగించాయి. ఆ తర్వాత దాదాపు ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. బెంచ్‌మార్క్ సూచీలు మిక్స్డ్ గ్లోబల్ క్యూస్‌ను ట్రాక్ చేస్తూ మధ్యలో పరిమితమైనప్పటికీ.. చివరి సెషన్లలో బలమైన రికవరీని నమోదు చేసింది. ఇదే క్రమంలో రానున్న వడ్డీ రేట్ల సమీక్షలో యూఎస్ ఫెడ్ రేట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తెలుస్తోంది. మే నెలకు చెందిన మీటింగ్ మినిట్స్ ప్రకారం నిపుణులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. US లేబర్ రిపోర్ట్ కొంత బలహీనతను చూపుతుందని అంచనాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications