Bitcoin Investment: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అధిక రాబడిని అందించే పెట్టుబడుల వెనుక పరిగెడుతున్న విషయం తెలిసిందే. రిస్క్ ఎక్కువైనా పర్లేదు రిటర్న్ మాత్రం అధికంగా ఉండాలని పెట్టుబడిదారులు చూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఈక్విటీ పెట్టుబడులతో పాటు క్రిప్టోలపై కూడా భారీగా మెుగ్గుచూపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి ఎన్నిక కావటంతో అదృష్టం పూర్తిగా తిరిగిందని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పెట్టుబడిదారుల తలరాతను మార్చేసిన బిట్‌కాయిన్ గురించే. ఎవరైనా భారతీయ పెట్టుబడిదారుడు 2010లో బిట్‌కాయిన్‌లో రూ.1,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.2,450 కోట్లకు చేరుకుంది. వాస్తవానికి ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 2009లో ప్రారంభించబడింది. భారత ప్రభుత్వం ప్రజలను ఇలాంటి అస్థిరమైన కరెన్సీ పెట్టుబడులను దూరంగా ఉంచేందుకు భారీగా టాక్సులను సైతం పెంచిన సంగతి తెలిసిందే. అయితే తొలినాళ్లలో విలువలేని ఈ కరెన్సీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఒక్కో బిట్‌కాయిన్ ధర ఏకంగా లక్ష డాలర్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఒక్కో కాయిన్ విలువ రూ.84.36 లక్షలుగా ఉంది.

ఈ క్రమంలో 2010లో ఒక్కో బిట్‌కాయిన్ ధర కేవలం 0.08 డాలర్లుగా ఉంది. అంటే దీని విలువ అప్పట్లో భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం కేవలం రూ.3.38 మాత్రమే. అప్పట్లో డాలర్ రూపాయి మారకపు విలువ రూ.42 వద్ద ఉన్నందున ఎవరైనా ఈ క్రిప్టోలో రూ.1000 పెట్టుబడిగా పెట్టి ఉంటే వారికి 295.85 బిట్ కాయిన్స్ వచ్చేవి. వాటిని అప్పటి నుంచి హోల్డ్ చేసి ఇప్పటి వరుకు కొనసాగించి ఉంటే ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోయేది. ట్రంప్ విక్టరీ తర్వాత ర్యాలీలో నవంబర్ 2024లో సగటున బిట్‌కాయిన్ ఒక్కోటి 98,000 డాలర్ల స్థాయికి చేరుకుంది.

ఇండియాలో బిట్‌కాయిన్‌కు సంబంధించిన నియంత్రణ స్పష్టంగా లేదు. దీన్ని పూర్తిగా నిషేధించాలని ఆర్బీఐ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో క్రిప్టోపై ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ పన్ను విధించింది. ప్రస్తుతం క్రిప్టో లాభాలపై 30 శాతం పన్ను ఉంది. అలాగే నిర్దిష్ట మొత్తం తర్వాత క్రిప్టో అమ్మకంపై 1% TDS కూడా వసూలు చేస్తోంది. అయితే 2025 నాటికి ఒక్కో బిట్‌కాయిన్ ధర ఏకంగా 2 లక్షల డాలర్లకు, 2029 నాటికి 5 లక్షల డాలర్లు, 2033 నాటికి మిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బెర్న్‌స్టెయిన్ అంచనా వేసింది. 2030 నాటికి బిట్‌కాయిన్ విలువ మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆర్చ్ ఇన్వెస్ట్ సీఈఓ కాథీ వుడ్ పేర్కొన్నారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications