Stock Market: తగ్గేదే లే అంటున్న మార్కెట్లు.. ఇక్కడ సీనే అమెరికాలో రిపీట్..
Stock Market: ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులు ఉన్నప్పట్టికీ తమ ప్రయాణంతో రికార్డులను తిరగరాయాలని చూస్తున్నాయి. అమెరికా మార్కెట్లలో సైతం ప్రస్తుతం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో జాగ్రత్త పడుతున్నారు.
ఉదయం 9.16 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 17 పాయింట్ల మేర పెరిగి ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 10 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 321 పాయింట్ల లాభంతో గరిష్ఠాలకు చేరుకునే ప్రయత్నంలో బుల్ జోరుతో ముందుకు సాగుతున్నాయి.

ప్రధఆనంగా అమెరికా మార్కెట్లలోని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటంతో అక్కడి మార్కెట్లు నిన్న నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లు కొంత ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్ల ప్రభావం వీటిపై కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బలమైన అమెరికా హౌసింగ్ డేటాతో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో స్వల్పంగా తగ్గాయి.
ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, టీసీఎల్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, నెస్లే, టాటా కన్జూమర్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, ఓఎన్జీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications