Cooking Oil: ప్రజలకు శుభవార్త.. వంటనూనె ధరలు తగ్గించాలని కేంద్రం ఆదేశం..
Cooking Oil Prices: ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత పెరిగిన వంటనూనె ధరలు ఇప్పటికీ అధికంగానే కొనసాగుతున్నాయి. దేశ ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా కుక్కింగ్ ఆయిల్స్ రేట్ల తగ్గుదలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని భారత ప్రభుత్వం వంట నూనె తయారీ సంస్థలను ఆదేశించింది. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని వంటనూనెల కంపెనీలు ప్రభుత్వానికి వెల్లడించినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది.

ఆవాల పంట కోతలు ప్రారంభమయ్యే మార్చి వరకు చిల్లర ధరల తగ్గింపు సాధ్యం కాదని పరిశ్రమల నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతి చేసుకునే దేశం భారత్ కావడం గమనార్హం. శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని గతేడాది జూన్‌లో 17.5% నుంచి 12.5%కి తగ్గించారు. ఇండియా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది.
అర్జెంటీనా నుంచి సోయాబీన్‌తో సహా తక్కువ మొత్తంలో క్రూడ్ సాఫ్ట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అలాగే దేశం ఉక్రెయిన్, రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి నూనెలపై ఎంఆర్‌పీని అంతర్జాతీయంగా ధరలు తగ్గినంతగా తగ్గించలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ జున్‌జున్‌వాలా లేఖలో తెలిపారు. వెజిటబుల్ ఆయిల్ బ్రోకరేజ్ సన్‌విన్ గ్రూప్ సీఈవో సందీప్ బజోరియా మాట్లాడుతూ.. డిసెంబర్‌లో ధరలు దాదాపు 10% తగ్గాయి మరియు జనవరిలో మళ్లీ 8% పెరిగాయి.


Click it and Unblock the Notifications