Bharat Rice: రేపటి నుంచే మార్కెట్లోకి భారత్ రైస్..! కేజీ ధర రూ.29.. పూర్తి వివరాలు
Rice @29: దేశంలో ప్రస్తుతం బియ్యం రేట్లకు రెక్కలు రావటంతో కోట్లాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేజీ రేటు దాదాపు రూ.70-80 మధ్య చాలా చోట్ల విక్రయించబడుతోంది. వాస్తవానికి పంట దిగుబడులు తగ్గటమే దీనికి ప్రధాన కారణంగా ఉంది.
భారీగా పెరుగుతున్న బియ్యం రేట్లకు కళ్లెం వేసే క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో వచ్చింది. భారత్ రైస్ పేరుతో సామాన్యులకు సబ్సిడీ ధరకు బియ్యాన్ని రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించించింది. రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కిలో బియ్యాన్ని కేవలం కేజీ రూ.29కి అందుబాటులో ఉంచనున్నారు.

దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నిరంతరం పెరుగుతున్న డిమాండ్ కంటే తక్కువగా ఉన్న ఉత్పత్తి కారణంగా అధిక బియ్యం ధరల సమస్య ఆందోళనగానే ఉందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లలో రిటైల్ విక్రయ రేట్లు చల్లారేందుకు భారత్ రైస్ ఆశాజనకంగా నిలుస్తుందని వారు చెబుతున్నారు. ఎఫ్‌సీఐ వద్ద పుష్కలంగా నిల్వలు ఉండటంతో పాటుగా.. ధాన్యం ఎగుమతులపై ప్రభుత్వం కొనసాగిస్తున్న పరిమితులు ధరాభారాన్ని తగ్గించటంలో దోహదపడతాయని అధికారులు యోచిస్తున్నారు.
బియ్యానికి ముందు భారత ప్రభుత్వం ప్రజలకు భారత్ దాల్, భారత్ అట్టా, చనా వంటి ఇతర వస్తువులను సబ్సిడీ రేట్లకు విక్రయిస్తోంది. మోదీ సర్కార్ చర్యలను పరిశీలిస్తే గత ఏడాది బియ్యం రేట్ల పెరుగుదలను విజయవంతంగా అడ్డుకునేందుకు.. తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధంతో పాటు దేశీయ సరఫరాలను మెరుగుపరచడానికి పార్-బాయిల్డ్ రైస్‌పై 20% ఎగుమతి సుంకాలను విధించింది. అలాగే గోధుమ వంటి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఎఫ్‌సిఐ బహిరంగ మార్కెట్ విక్రయ పథకం ప్రభావవంతమైన సాధనంగా నిరూపించబడిందని ఇటీవల ఆహార మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications