Army: పొరుగు దేశం చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో దానిని ఎదుర్కొనేందుకు భారత్ రెడీ అవుతోంది. ఇందుకోసం రక్షణ సామర్థ్యాన్ని మరితం బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. భారీ స్థాయిలో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది.
ఆర్మీ బలోపేతమే లక్ష్యంగా కీలక సైనిక పరికరాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 800 కోట్ల విలువైన రెండు ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొనుగోళ్లు ఇండియన్-ఐడిడిఎం కేటగిరీ కిందకు వస్తాయి. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ ఉత్పత్తికి, రక్షణ రంగంలో స్వావలంబనకు అనుగుణంగా ఈ ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది.

క్యూటీ-697 బోగీ ఓపెన్ మిలిటరీ (BOM) వ్యాగన్ల ఉత్పత్తి కోసం జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్‌తో 473 కోట్లకు ఒక ఒప్పందం కుదిరింది. Qty-56 మెకానికల్ మైన్‌ఫీల్డ్ మార్కింగ్ ఎక్విప్‌మెంట్ (MMME) మార్క్ II సేకరణ కోసం BEML లిమిటెడ్‌తో 329 కోట్ల విలువైన మరో అగ్రిమెంట్ జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO) రూపొందించిన బోగీ ఓపెన్ మిలిటరీ (BOM) వ్యాగన్లు భారత సైన్యానికి ప్రత్యేక రవాణా వాహనాలుగా పనిచేస్తాయి. ఆర్మీ యూనిట్ల సమీకరణ కోసం ఇవి రూపొందించడ్డాయి. BOM బండ్లు తేలికపాటి వాహనాలే కాక ఆర్టిలరీ గన్స్, BMPలు మరియు ఇంజినీరింగ్ సామగ్రితో సహా వివిధ సైనిక ఎక్విప్‌మెంట్స్ కలిగి ఉంటాయి. తక్కువ సమయంలోనే అవసరమైన ప్రాంతాలకు సైనికులను తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
BEML నుంచి మెకానికల్ మైన్‌ఫీల్డ్ మార్కింగ్ ఎక్విప్‌మెంట్ (MMME) మార్క్ II సేకరణకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇవి మైన్‌ఫీల్డ్‌లను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని సంప్రదాయ ఆయుధాలలోని కన్వెన్షన్‌పై సవరించిన ప్రోటోకాల్-II ప్రకారం భారత్ ఈ డీల్‌పై సంతకం చేసింది. ఇన్-సర్వీస్ హై మొబిలిటీ వెహికల్ పరికరాల అధునాతన మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ సిస్టమ్‌లు, మైన్‌ఫీల్డ్ మార్కింగ్ సమయాన్ని తగ్గించగలవు. తద్వారా సైన్యం సామర్థ్యాన్ని పెరుగుతుందని అంచనా.


Click it and Unblock the Notifications