Gold Bonds: భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాటల్లో చెప్పలేనిది. చిన్న మెుత్తంలో డబ్బు ఉన్నా అందరూ బంగారం కొనాలని చూస్తుంటారు. వీటిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాక.. సంక్షోభ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా కూడా చూస్తుంటారు.
నేటి నుంచి మోదీ ప్రభుత్వం రూ.500 తగ్గింపుతో చౌకగా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయటం వల్ల ఎక్కువ రక్షణ ఉంటుంది. పైగా దీనిని ఎలక్ట్రానికి విధానంలో ఉన్న చోట నుంచే కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించబడింది. భారత ప్రభుత్వ హామీలో లభిస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్స్ విక్రయం నేటి నుంచి ప్రారంభం కావటం చాలా మందిలో కోలాహలాన్ని నింపుతోంది.

నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వ గోల్డ్ బాండ్(SGB) విక్రయించబడనున్నాయి. అంటే ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం రిజర్వు బ్యాంక్ గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.6.263గా నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గోల్డ్ బాండ్స్ నాలుగో సిరీస్‌లో భాగంగా గ్రాముకు రూ.50 తగ్గింపు రేటు అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా పెట్టుబడిదారుడు 10 గ్రాములను రూ.500 తగ్గింపు రేటుతో పొందవచ్చు. ఏ వ్యక్తి అయినా ఒకేసారి కనీసం ఒక గ్రాము నుంచి 500 గ్రాముల వరకు డిజిటల్ గోల్డ్ కొనేందుకు వెసులుబాటు ఉంది.
వీటిని ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ మార్గాల్లో కొనుగోలు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర బ్యాంకుల వెబ్‌సైట్ ద్వారా బంగారు బాండ్ల కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా సమీపంలోని మీ బ్యాంక్ శాఖను సందర్శించటం ద్వారా కూడా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. SBI, PNB, HDFC, ICICI, పోస్ట్ ఆఫీస్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా బాండ్లను కొనుక్కోవచ్చు. పైగా వీటిలో పెట్టే పెట్టుబడి మెుత్తంపై వడ్డీ ఆదాయం కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications