Crude Prices: భారత ప్రభుత్వం ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును తాజాగా పెంచింది. ఈ క్రమంలో మెట్రిక్ టన్నుకు గతంలో రూ.6,800 నుంచి రూ.9,600కి భారీ పెరుగుదలను నమోదు చేసింది. డీజిల్, ATFలకు పన్ను రేటును సున్నాగా ఉంచింది. దీనికి ముందు ఏప్రిల్ 4న కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ.4,900 నుంచి రూ.6,800కి పెంచిన సంగతి తెలిసిందే.
మార్చి 15, 2024న దేశీయ ముడి చమురు అమ్మకాలపై విండ్‌ఫాల్ పన్నును ఆర్థిక మంత్రిత్వ శాఖ టన్నుకు రూ.4,900కి పెంచింది. జూలై 2022లో ముడి చమురు ఉత్పత్తిదారులను లక్ష్యంగా చేసుకుని మోదీ ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్ను విధించింది. ఈ పన్ను తరువాత పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ATF) ఎగుమతులకు విస్తరించబడింది.

దేశీయ మార్కెట్‌లో సరఫరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విదేశాల్లో ఈ ఇంధనాలను విక్రయించడం ద్వారా పెరిగిన అంతర్జాతీయ ధరలను ప్రైవేట్ రిఫైనర్‌లు గతంలో పొందుతుండేవి. అయితే దీని వల్ల దేశీయ ప్రజలు ప్రభావితం అవడాన్ని తగ్గించటాన్ని నిరోధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అసలు ఈ కొత్త తరహా పన్నును దేశంలో ప్రవేశపెట్టింది. దీనిని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతి రెండు వారాలకు ఒకసారి సర్దుబాటు చేస్తుంటుంది.
గతవారం చివర్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగాయి. దీంతో నేడు జూన్ డెలివరీకి బ్రెంట్ ఫ్యూచర్స్ 36 సెంట్లు అంటే దాదాపు 0.40% పెరిగి బ్యారెల్‌కు 90.46 డాలర్లకు చేరుకుంది. అలాగే మే డెలివరీకి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ఫ్యూచర్స్ 42 సెంట్లు లేదా దాదాపు 0.42% పెరిగి 85.83 డాలర్లకు చేరుకుంది. దాడి తర్వాత ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించటంతో చమురు ధరలను భయాలు ముందుకు నడిపాయి. ఇది అక్టోబర్ తర్వాత ధరలను అత్యధిక స్థాయికి చేరుకునేలా చేసింది.


Click it and Unblock the Notifications