Tax Refund: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. టాక్స్ రిఫండ్స్‌పై కీలక నిర్ణయం..
Tax Refund: ఎక్కువ ఆదాయం పొందే కేటగిరీ కిందకు వచ్చే చాలా మంది పన్ను చెల్లింపుదారులకు టాక్స్ డిడక్షన్స్ ఎట్ సోర్స్ రూపంలో మూలం వద్ద పన్ను వసూలు చేయబడుతుంది.
జరిమానా లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి గడువు జూలై 31, 2023 అని పన్ను చెల్లింపుదారులకు తెలిసిందే. ఈ గడువు నాటికి చాలా మంది తమ రిటర్న్ ఫైల్ చేశారు. ఈ క్రమంలో ఎక్కువ మంది తమకు వచ్చే టాక్స్ రిఫండ్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సగటు ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని పన్ను శాఖ యోచిస్తోంది. ఈ సమయాన్ని ప్రస్తుతం ఉన్న 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించాలని ఆలోచనలో ఉన్నారు.

కొత్త టైమ్‌లైన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలులోకి వస్తుందని ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. టాక్స్ రిఫండ్ వెంటనే రాదని, ఇప్పటికే చెల్లించిన పన్నుల వివరాలను ఆదాయపు పన్ను శాఖ తన వద్ద అందుబాటులో ఉన్న సమాచారం నుంచిధృవీకరించిన తర్వాత మాత్రమే జారీ చేయబడుతుందని టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు బల్వంత్ జైన్ తెలిపారు.
ITRని ఫైల్ చేసి ధృవీకరించిన తర్వాత వాపసు పొందడానికి 20-45 రోజులు పడుతుందని Tax2Win CEO, సహ వ్యవస్థాపకుడు అభిషేక్ సోనీ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను శాఖ అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఐటీఆర్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసినట్లు తెలిపారు.
31 జూలై 2023 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఇది AY22కి సంబంధించిన మొత్తం ITR కంటే 16.1% ఎక్కువ. దీనికి ముందు 31, జూలై 2022 సమయంలో మెుత్తం ఫైల్ అయిన ఐటీఆర్‌ల సంఖ్య 5.83 కోట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications